ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎదురురెబ్బ.. ఎమ్మెల్సీగా టీడీపీ వేపాడ చిరంజీవి రావు ఘన విజయం...

By SumaBala BukkaFirst Published Mar 18, 2023, 6:51 AM IST
Highlights

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘన విజయం సాధించారు. 

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టిడిపి ఉత్తరాంధ్రను కైవసం చేసుకుంది.  మండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటినీ కైవసం చేసుకుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు భారీ విజయం సాధించారు.  దీంతో పాటు తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టపద్రుల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. ఇక పశ్చిమ రాయలసీమలో టిడిపి, వైసిపిల మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. 

వీటికి సంబంధించిన వివరాలలోకి వెళితే  ఏపీ, తెలంగాణ  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  వీటికి సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలోని ఉత్తరాంధ్ర స్థానంలో టిడిపి జెండా పాతింది.  విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతాన్ని టిడిపి అభ్యర్థి చిరంజీవి రావు తొలి ప్రాధాన్యంలోనే సాధించారు. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో దక్కించుకున్నారు. ఉత్తరాంధ్ర స్థానంలో విజయం సాధించాలంటే 94,509 కోట ఓట్లు అవసరం. కాగా, చిరంజీవిరావుకు  82, 958 ఓట్లు మొదటి ప్రాధాన్యంలో వచ్చాయి. 

AP MLC Results: వైసీపీకి షాక్.. తూర్పు రాయలసీమలో కంచర్ల శ్రీకాంత్‌ ఘనవిజయం.. టీడీపీ శ్రేణుల సంబరాలు

విజయం చిరంజీవిరావుదేనని డిక్లేర్ చేయాలంటే ఇంకా 11,551 ఓట్లు అవసరం. ఈ స్థానం నుండి 33 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. వారికి, బిజెపి అభ్యర్థి మాధవ్ లకు వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోను టిడిపి అభ్యర్థి చిరంజీవిరావుకి మెజారిటీ ఓట్లు దక్కాయి.  ఇక ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన పిడిఎఫ్ అభ్యర్థి రమాప్రభకు దక్కిన ఓట్లలో దాదాపు 18,000 లెక్కపెట్టే సమయానికి విజయానికి అవసరమైన కోటా ఓట్లు చిరంజీవి రావుకు దక్కాయి.  దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ ఆయనదే విజయం అని ఖరారు అయిపోయింది. ఆ తర్వాత సర్టిఫికెట్ ఇచ్చి ఈ  విజయాన్ని అధికారికంగా వెల్లడించారు.

ఈ క్రమంలోనే టీడీపీ వైసీపీల మధ్య హోరాహోరి పోరు జరిగింది. టిడిపి అభ్యర్థి చిరంజీవిరావుకు కోటా ఓట్లు 94,509 వచ్చే సమయానికి, వైసీపీ అభ్యర్థి సుధాకర్ కు కోటా ఓట్లు 59, 644 వచ్చాయి. ఇక ఈ తొలి ప్రధాన్య ఓట్ల కౌంటింగ్ గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభం అయ్యింది.  అప్పటినుంచి కూడా టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు, వైసీపీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్ ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేదు. టిడిపి అభ్యర్థి మొదటి రౌండ్ నుంచే ఆధిక్యంలో ఉన్నారు. 

ఇక్కడ మొత్తం 2,01,335  ఓట్లు పోలయ్యాయి. వీటిని ఎనిమిది రౌండ్లలో లెక్కించారు. టిడిపి అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓట్లలో 41.20%, వైసీపీ అభ్యర్థికి 27.25% ఓట్లు దక్కాయి. ఇద్దరి మధ్య 13.95% వ్యత్యాసం ఉంది. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మాధవ్ తో పాటు, మరో 34 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు.

ఇక తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. శుక్రవారం నాడు చిత్తూరు ఎస్విసెట్ కాలేజీలో రెండో రోజు కూడా ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఇక్కడ మొత్తం 2,69,339 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లు ఈ లెక్కింపు  జరిగింది. ఇందులో 20,979  చెల్లని ఓట్లు ఉన్నాయి... 
 

 

click me!