ఆయనకు 52, ఆమెకు 25.. ఫేస్ బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం.. పోలీసులు పట్టుకోవడంతో...ఆత్మహత్య....

Published : Nov 05, 2022, 06:55 AM IST
ఆయనకు 52, ఆమెకు 25.. ఫేస్ బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం.. పోలీసులు పట్టుకోవడంతో...ఆత్మహత్య....

సారాంశం

నంద్యాలలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. అయితే, అంతకుముందే పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. 

నంద్యాల : వారిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం.. వయసులో తనకంటే రెట్టింపు పెద్దవాడు. అయినా.. మనసులు కలిశాయి. రెండేళ్లు చాటింగులు, ఫోన్లతో గడిపిన తరువాత చివరికి ఓ రోజు అతని దగ్గరికి వెళ్లిపోయింది. వీరిద్దరికీ ఇదివరకే పెళ్లిళ్లయి.. పిల్లలున్నారు. అను భార్యను వదిలేస్తే, ఆమె భర్తను వదిలేసింది. దీంతో ఇద్దరూ కలిసుందామనుకున్నారు. కానీ మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... 

ఓ వివాహిత అనుమానాస్పదంగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన అనంతరం జిల్లా దొర్నిపాడులో చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా నరసయ్య పాలెం గ్రామానికి చెందిన భూషణానికి 52 ఏళ్లు. అతడి కుమారుడు (20), కుమార్తె (18)  ఉన్నారు. భార్యను వదిలేశాడు. అలాగే దొర్నిపాడుకు చెందిన హసీనా(25)కు ఇద్దరు పిల్లలు. భర్త మద్యానికి బానిస కావడంతో అతనికి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భూషణం, హసీనాలకు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది.

ఆటో డ్రైవర్ హత్య కేసులో భార్యే సూత్రధారి.. ప్రియుడితో కలిసి చంపేసి, పొదల్లో పడేసి...ఏమీ తెలియనట్టు...

రెండేళ్లుగా తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడంతోపాటు.. చాటింగ్ చేసుకుంటుండేవారు. ఈ మధ్యకాలంలో భూషణం హసీనాకు తన వద్దకు వచ్చేయాలని పిలవడంతో ఈనెల 1న ఇంట్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా ఏడేళ్ళ కొడుకుతో కలిసి అతని దగ్గరికి వెళ్లి పోయింది. ఈ ఘటనపై హసీనా తండ్రి దూదేకుల బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వీరికోసం గాలించి బాపట్లలోని నరసయ్యపాలెంలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దొర్నిపాడు తీసుకువచ్చారు. ఎస్సై తిరుపాలు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

మూడవ తేదీ రాత్రి హసీనాను తండ్రికి అప్పగించి ఇంటికి పంపించారు. భూషణాన్ని కూడా పోలీసులు వదిలి వేయడంతో అతను తిరిగి బాపట్లకి వెళ్ళిపోయాడు. శుక్రవారం తాసిల్దార్ సమక్షంలో హసీనాను బైండోవర్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఆమె ఉదయం ఆరు గంటల సమయంలో తన మేనమామ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఇద్దరు పిల్లలు ఉండి ఫేస్బుక్లో పరిచయం ఏర్పడటం, అది కాస్తా ఒక ప్రాణం తీసుకోవడానికి కారణం కావడం బాధాకరం అని స్థానికులు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu
Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు | Siddhartha Academy Golden Jubilee | Asianet News Telugu