వారం రోజుల్లో ఉపాధి హామీ బకాయిల విడుదల: ఏపీ హైకోర్టుకు జగన్ సర్కార్ హామీ

Published : Sep 22, 2021, 05:02 PM IST
వారం రోజుల్లో ఉపాధి హామీ బకాయిల విడుదల: ఏపీ హైకోర్టుకు జగన్ సర్కార్  హామీ

సారాంశం

ఉపాధి హామీ బకాయిలను చెల్లించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే వారం రోజుల్లో బకాయిలను విడుదల చేసేలా సర్పంచ్ లకు ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

అమరావతి:ఉపాధి హామీ పథకం (mgnrega) కింద బకాయిలను  వారం రోజుల్లో కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించాలని సర్పంచ్ లకు ఆదేశిలిచ్చినట్టుగా ఏపీ ప్రభుత్వం (ap government) ఏపీ హైకోర్టుకు (ap high court)తెలిపింది.ఉపాధి హామీ పథకం కింద నిధుల బకాయిల విడుదల విషయమై విచారణ సందర్భంగా ఏపీ రాష్ట్ర హైకోర్టుకు ఐఎఎస్ఎలు గోపాలకృష్ణద్వివేది, గిరిజా శంకర్ లు బుధవారం నాడు హాజరయ్యారు.

దసరా నాటికి బకాయిలను చెల్లించి తీరాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. నిధులు చెల్లించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాల పాటి శ్రీనివాస్‌ (dammalapati srinivas) వీరారెడ్డి(veera Reddy), నర్రా శ్రీనివాస్‌ (Narra Srinivas) వాదించారు. కేంద్రం అక్టోబర్‌ 31లోపు బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్‌ ఫైల్‌ చేసింది.

 ఇప్పటికే రూ.1,100 కోట్లు చెల్లించామని కేంద్రం (union government) పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాదనపై పిటిషనర్‌ తరపు న్యాయవాదుల అభ్యంతరం తెలిపారు. సోషల్‌ ఆడిట్‌ జరిగాకా మళ్లీ విచారణ పేరిట కొర్రీలు వేస్తున్నారని పిటిషనర్లు  కోర్టుకు తెలిపారు. సర్పంచ్‌ అకౌంట్లలోకి నిధులు వెళ్తే ఇవ్వడంలేదని న్యాయవాదులు పేర్కొన్నారు. వారంరోజుల్లో కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించాలని సర్పంచ్‌లకు ఆదేశాలిచ్చామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్