ప.గో: ఇళ్ల పట్టాల పంపిణీలో రగడ.. వేదికపై టీడీపీ ఎమ్మెల్యేతో ఘర్షణ

By Siva KodatiFirst Published Dec 25, 2020, 8:27 PM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రగడ నెలకొంది. ఇళ్ల పట్టాల పంపిణీ సక్రమంగా సాగడం లేదంటూ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు వేదికపై ప్రశ్నించారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రగడ నెలకొంది. ఇళ్ల పట్టాల పంపిణీ సక్రమంగా సాగడం లేదంటూ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు వేదికపై ప్రశ్నించారు.

దీంతో రామరాజుపై వైసీపీ కన్వీనర్ నరసింహారాజు వాగ్యుద్దానికి దిగారు. స్టేజ్‌ పైనే ఇద్దరు విమర్శలు చేసుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఆందోళన నెలకొంది. దీంతో ఇరు వర్గాలకు సీనియర్ నేతలు, పోలీసులు సర్దిచెప్పారు.

Also Read:ఫలానా కులం, మతం వారొద్దంటే రాజధానెలా అవుతోంది?:అమరావతిపై జగన్ సంచలనం

కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వేర్వేరు తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది.

కోస్తా జిల్లాల్లో ఇవాళ, రాయలసీమకు సంబంధించి ఈ నెల 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో, ఉత్తరాంధ్రకు ఈనెల 30న విజయనగరంలో సీఎం జగన్‌ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం 15 రోజుల పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు.  
 

click me!