స్వామినాథన్ కమిటీ చెప్పిందే చేశాం: వ్యవసాయ చట్టాలపై జీవీఎల్ స్పందన

By Siva KodatiFirst Published Dec 25, 2020, 5:47 PM IST
Highlights

అనేక పదవులు అలంకరించినా ఒకేరకమైన వ్యక్తిత్వంతో వాజ్‌పేయి ఉన్నారని ప్రశంసించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. శుక్రవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన రైతులతో సమావేశమయ్యారు.

అనేక పదవులు అలంకరించినా ఒకేరకమైన వ్యక్తిత్వంతో వాజ్‌పేయి ఉన్నారని ప్రశంసించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. శుక్రవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన రైతులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ కుటుంబంలో జన్మించిన అటల్‌జీ.. ప్రధాని గా ఎదిగారని గుర్తుచేశారు. ఇప్పుడు మోడీ కూడా అదే బాటలో పాలన సాగిస్తున్నారని.. వాజ్‌పేయి పనితీరు, పాలన నేటి తరాలకు స్పూర్తి దాయకమన్నారు.

వ్యవసాయ సంస్కరణలను మూడు చట్టాల రూపంలో తెచ్చామని.. వీటి పై దేశ వ్యాప్తంగా అనేక అపోహలు ఉన్నాయని జీవీఎల్ తెలిపారు. రైతుకు మేలు చేయాలనే మోడీ ఈ కొత్త చట్టాలను తెచ్చారని.. యూరియా ఇబ్బంది లేదంటే అది బిజెపి ప్రభుత్వం కృషి వల్లేనని నరసింహారావు గుర్తుచేశారు.

వ్యవసాయ రంగానికి ఆరు రెట్లు బడ్జెట్ లో కేటాయింపులు పెంచామని.. యాభై లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నీటిపారుదల అందేలా చేశామని జీవీఎల్ చెప్పారు. దేశంలో ఉన్న వెయ్యి మార్కెట్‌లలో ధరలు తెలుసుకుని రైతులు అమ్ముకునేలా ఈనామ్ తెచ్చామని ఆయన వెల్లడించారు.

పంట భీమ యోజన కింద ప్రీమియం కూడా తగ్గించి 6.6 కోట్ల మంది రైతుల పంటలను ఇన్సూరెన్స్ చేయించామని.. కాంగ్రెస్ హయాంలో వరి, గోధుమ తప్ప ఏదీ కొనుగోలు చేయలేదని జీవీఎల్ దుయ్యబట్టారు.

బిజెపి ప్రభుత్వంలో రెండున్నర రెట్లు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేశామని ఆయన గుర్తుచేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా మోడీ  నూతన విధానాలను అమలు చేశారని.. స్వామినాధన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ముఖ్య పంటలకు ధర రావాలని సిఫార్సు చేశారని నరసింహారావు పేర్కొన్నారు.

2005-06లో ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిపోర్ట్ ను పక్కన పడేసిందని.. 2018లో మోడీ ప్రభుత్వం ఖర్చు కంటే యాభై శాతం లాభం చేకూర్చేలా చేసిందని జీవీఎల్ తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమను విమర్శిస్తుందని.. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వాస్తవానికి దూరం గా ఉన్నాయని నరిసింహారావు పేర్కొన్నారు.

ప్రజల్లో అపోహలు కలిగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని.. ఇప్పుడు చేసిన మూడు వ్యవసాయ చట్టాలలోని అంశాలు..  స్వామినాధన్ కమిషన్ చెప్పినవేనని ఆయన గుర్తుచేశారు.

ఎంఎస్‌పీ ధరపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. ఇతర పార్టీలు చేస్తున్న తప్పులను ప్రజలు గమనిస్తున్నారని జీవీఎల్ తెలిపారు. తమ విధానాలను, సంస్కరణలను ప్రజలకు, రైతులకు వివరిస్తామని నరసింహారావు స్పష్టం చేశారు. 

click me!