మాన్సాస్ వ్యవహారం.. ఎన్ని దెబ్బలు తగిలినా బుద్దిరావడం లేదు: జగన్ సర్కార్‌పై అశోక్ గజపతి ఆరోపణలు

By Siva KodatiFirst Published Aug 11, 2021, 6:45 PM IST
Highlights

వరుసగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నా బుద్ధి రావడం లేదంటూ ఎద్దేవా చేశారు  మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతి రాజు. ఎక్కడా లేని విధంగా మాన్సాస్‌ వ్యవహారంలో ప్రభుత్వం తలదూర్చిందని అశోక్ మండిపడ్డారు

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా తనను తిరిగి నియమిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు. వరుసగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నా బుద్ధి రావడం లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎక్కడా లేని విధంగా మాన్సాస్‌ వ్యవహారంలో ప్రభుత్వం తలదూర్చిందని అశోక్ మండిపడ్డారు. ఇష్టానుసారంగా నియామకాలు చేసి ట్రస్ట్‌ని డ్యామేజ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైకోర్టు చెప్పినా.. ఇప్పటి వరకు ఈవో తనను కలవలేదని అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. తాను ఇచ్చిన ఆదేశాలను ఈవో పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. దేవాలయాలపై అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని.. హిందూ ఆచారాలకు విరుద్ధంగా నియామకాలు మార్చారని అశోక్ వ్యాఖ్యానించారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అశోక్ గజపతి రాజు అన్నారు. ప్రభుత్వానికి మాన్సాస్ ట్రస్ట్ రూ. కోట్లు ట్యాక్స్ కడుతున్నా తమ మీదే పెత్తనం చేయాలని వైసీపీ సర్కార్ చూస్తోందని ఆయన మండిపడ్డారు. 

Also Read:సంచయిత, ఏపీ సర్కార్‌కి హైకోర్టు షాక్: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ బాధ్యతలు ఆశోక్‌కే

కాగా, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ గా మాజీ కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు కొనసాగింపునకే ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.ఏపీ ప్రభుత్వంతో పాటు సంచయిత గజపతిరాజు పిటిషన్లను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచీ కొట్టివేసింది.ఈ విషయమై దాఖలైన అనుబంధ పిటిషన్లను కూడ హైకోర్టు తోసిపుచ్చింది.ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశోక్‌గజపతిరాజును చైర్మెన్ పదవి నుండి తప్పించారు

click me!