ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

Siva Kodati |  
Published : Sep 20, 2023, 09:34 PM IST
ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

సారాంశం

ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ ఆరోగ్య పరిస్ధితిపై తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 

రెండు రోజుల క్రితం ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. గవర్నర్‌కు అపెండెక్టమీ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.  

ఇకపోతే.. మంగళవారం మణిపాల్ ఆసుపత్రిలో గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను పరామర్శించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సోమవారం సాయంత్రం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో గవర్నర్ మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో గవవర్నర్ అబ్దుల్ నజీర్‌కు రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ విజయవంతంగా నిర్వహించింది మణిపాల్ ఆసుపత్రి. 
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu