ఇకపై విశాఖ నుంచే వైసీపీ రాష్ట్ర వ్యవహారాలు : వైవీ సుబ్బారెడ్డి

By Siva KodatiFirst Published Sep 20, 2023, 9:13 PM IST
Highlights

విశాఖ నుంచే వైసీపీ రాష్ట్ర వ్యవహారాలు కొనసాగుతాయన్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రాకతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుందని.. విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ దసరా నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ నుంచే వైసీపీ రాష్ట్ర వ్యవహారాలు కొనసాగుతాయన్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ కేంద్రం పరిపాలన చేయాలనే నిర్ణయం అభివృద్ధికి సూచిక అన్నారు. విశాఖకు దశలవారీగా విభాగాల తరలింపు వుంటుందని సుబ్బారెడ్డి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రాకతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుందని.. విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయని.. జగన్ రాకతో అవి మరింత పెరుగుతాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

ALso Read: చంద్రబాబు స్కాంలపై అసెంబ్లీలో చర్చిద్దాం: కేబినెట్ లో మంత్రులతో జగన్ కీలక వ్యాఖ్యలు

అంతకుముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను  ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్  మీడియాకు వివరించారు. ప్రభుత్వ బడుల్లో  ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  మంత్రి  చెప్పారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. బధిర టెన్నిస్ ప్లేయర్ జఫ్రీన్ కు ఇళ్ల స్థలం మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని  మంత్రి చెప్పారు. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు పీవోటి చట్ట సవరణకు కేబినెట్ ఆమోదించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకు కూడ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.


 

click me!