ఆవు చేలోమేస్తే దూడ గట్టున మేస్తుందా..? లోకేష్ పరిస్థితి అంతే: ఎమ్మెల్యే ఆర్కే

By Arun Kumar PFirst Published Apr 9, 2021, 11:46 AM IST
Highlights

గత ప్రభుత్వ హయాంలో కేవలం స్వలాభం కోసమే రాజధాని దళిత రైతుల వద్ద భూములు లాక్కునారని మరోసారి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. 

తాడేపల్లి: చంద్రబాబు పై తాను వేసిన ప్రతి అవినీతి కేసులోనూ 99 శాతం విజయం సాధించాననని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తెలిపారు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట... ఈ విషయం మరొకసారి రుజువయ్యిందన్నారు. తాను వేసిన పిటిషన్స్ లో తప్పులు ఉంటే కోర్టు లో కేసులు కోట్టేసేవారని... అలా జరగలేదన్నారు. న్యాయం కాస్త ఆలస్యంగా జరగొచ్చు... కానీ ఏ రోజుకైనా గెలిచేది అదేనని ఆళ్ల పేర్కొన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో కేవలం స్వలాభం కోసమే రాజధాని దళిత రైతుల వద్ద భూములు లాక్కునారని మరోసారి ఆళ్ల ఆరోపించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు బినామీల వాటా ఎంతో తెలుసు కాబట్టే తాడికొండ, మంగళగిరి ప్రాంతాలలో ప్రజలు టిడిపిని ఓడించి బుద్ది చెప్పారన్నారు. చంద్రబాబు మోసం చేసారు కాబట్టి జగన్ కు పట్టం కట్టి నిరూపించారని... ప్రజల మనోగతంతోనే వైసిపి అన్ని సీట్లు సాధించగలిగిందన్నారు. ఆవు చేలోమేస్తే దూడ గట్టున మేస్తుందా? లోకేష్ పరిస్థితి కూడా అంతేనని ఆళ్ల విమర్శించారు. 

తాడేపల్లి మంగళగిరి ప్రజల అభివృద్ధి కోసమే కార్పొరేషన్ ఏర్పాటుచేశామన్నారు. శాసన రాజధాని ఇక్కడే ఉంటుందని... దీనిపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేసామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల వెల్లడించారు. 

read more  అమరావతిలో అక్రమాలు నిజం.. అన్నీ చెప్పలేను, బాధితుల్ని బెదిరిస్తారు: ఎమ్మెల్యే ఆర్కే

ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నానని ఆర్కే వెల్లడించారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించడంపై ఆయన స్పందించారు. హైకోర్టులో తప్పించుకున్నా.. సుప్రీంకోర్టులో మొట్టికాయలు తప్పవని ఆళ్ల తెలిపారు. తన దగ్గర వున్న ఆధారాలతో సీఐడీకి ఇచ్చానని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే వాటిని నిరూపించడానికి కొంత సమయం పడుతుందని ఆళ్ల అభిప్రాయపడ్డారు. 

చంద్రబాబు, మాజీమంత్రి నారాయణల సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సీఐడీ కేసు విచారణపై న్యాయస్థానం 4 వారాలు స్టే విధించింది. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయస్థానం కోరింది.

ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని, పూర్తి స్థాయి విచారణకు అనుమతించాలని హైకోర్టును సీఐడీ అధికారులు కోరారు. దీనిపై స్పందించిన కోర్టు..  ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో చంద్రబాబు, నారాయణకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా? అని నిలదీసింది.
 

click me!