అమరావతి స్కామ్‌పై నేను, నందిగం వస్తాం.. బాబు, నారాయణ చర్చకు వస్తారా: ఆర్కే సవాల్

By Siva KodatiFirst Published Mar 26, 2021, 5:36 PM IST
Highlights

రాజధాని అమరావతిలో టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలపై వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజధాని భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 

రాజధాని అమరావతిలో టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలపై వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజధాని భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు టీడీపీ చెప్పుకుంటోందని.. చంద్రబాబు మోసం చేశారని రైతులే ఆరోపించారని చెప్పారు ఆర్కే. రాజధాని ప్రాంతంలో దళిత రైతులకు అన్యాయం జరిగిందని.. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికే స్టింగ్ ఆపరేషన్న చేశారా అని ఆళ్ల ప్రశ్నించారు. దళితుల్ని భయపెట్టి భూములు లాక్కున్నారని.. చంద్రబాబు, నారాయణ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

అసైన్డ్ భూముల విషయంలో టీడీపీ తనకు అనుకూలమైన జీవోలు తీసుకొచ్చిందని.. అసైన్డ్ భూములే కాదు, లంక భూముల్ని కూడా అలాగే చేశారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు.

రైతుల స్టేట్‌మెంట్లను సీఐడీ అధికారులు రికార్డ్ చేశారని.. రాజధాని భూములపై పచ్చమీడియా తప్పుడు రాతు రాస్తోందని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విచారణలో వాస్తవాలన్నీ బయటకొస్తాయని.. పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేశారని ఆర్కే చెప్పారు.

భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం లాగేసుకుంటుందని రైతులను బెదిరించారని.. రైతులను భయపెట్టి బాబు, ఆయన బినామీలు చౌకగా భూములు కొన్నారని ఆళ్ల చెప్పారు.

అప్పటి అధికారులపై ఒత్తిడి తెచ్చి భూముల రిజిస్ట్రేషన్ చేయించారని.. తాను నందిగం చర్చకు వస్తామని, చంద్రబాబు, నారాయణ బహిరంగ చర్చకు రావాలని రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. 

click me!