వైఎస్ జగన్ కు మద్దతు: చిరంజీవిపై సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

By telugu team  |  First Published Dec 23, 2019, 12:06 PM IST

వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థించడంపై చిరంజీవిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తమ్ముడు పవన్ కల్యాణ్ భుజం తట్టకుండా చిరంజీవి మరో రాగమెత్తుకున్నారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థించడంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత, తమ్ముడు పవన్ కల్యాణ్ జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండగా చిరంజీవి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటం చేస్తుంటే భుజం తట్టకుండా మరో రాగమెత్తుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిరంజీవిపై ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆయన చిరంజీవిపై వ్యాఖ్యలు చేశారు. 

Latest Videos

Also Read: ఫేక్ లెటర్స్ తో నాకు సంబంధం లేదు.. 3 రాజధానులపై చిరంజీవి క్లారిటీ!

అప్పుడు ప్రజారాజ్యం పెట్టి దాన్ని రో పార్టీలో కలిపారని, మంత్రి పదవి పొంది విభజన పాపంలో పాలు పంచుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు తమ్ముడు ప్రజల కోసం పోరాటం చేస్తుంటే భుజం తట్టకుండా మరో రాగం ఎత్తుకున్నారని ఆయన అన్నారు. 

తెలంగాణలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయని, మళ్లీ దూకేస్తారేమోనని ఆయన చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. 

click me!