టీడీపీ నేత మండలి బుద్దప్రసాద్ జనసేనలో చేరారు.పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
విజయవాడ: టీడీపీ నేత మండలి బుద్దప్రసాద్ సోమవారంనాడు జనసేనలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మండలి బుద్దప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
ఆవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ టిక్కెట్టును మండలి బుద్దప్రసాద్ ఆశించారు. అయితే ఆవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు కేటాయించింది. ఆవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుండి అనుచరులతో కలిసి వెళ్లి పవన్ కళ్యాణ్ సమక్షంలో మండలి బుద్దప్రసాద్ జనసేనలో చేరారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను టీడీపీ కేటాయించింది. ఇప్పటికే 19 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మండలి బుద్దప్రసాద్ జనసేనలో చేరడంతో ఆయనకే ఆవనిగడ్డ టిక్కెట్టు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఆవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపుతారో అధికారికంగా జనసేన ప్రకటించాల్సి ఉంది.
జనసేనలో చేరిన మాజీ మంత్రి, మాజీ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్. ఈ రోజు పిఠాపురంలో ఆయనకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. pic.twitter.com/AaEswwC2xE
— JanaSena Party (@JanaSenaParty)ఇదిలా ఉంటే ఆవనిగడ్డ అసెంబ్లీ టిక్కెట్టును శ్రీనివాస్ ఆశించారు. మండలి బుద్దప్రసాద్ కే టిక్కెట్టు కేటాయిస్తారనే ప్రచారం ప్రారంభం కావడంతో శ్రీనివాస్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
👉 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి. Have your say! 📢https://telugu.asianetnews.com/mood-of-andhra-survey