పది కార్డులతో .. నిమిషాల వ్యవధిలో లక్షల్లో నగదు విత్ డ్రా , ఎన్టీఆర్‌ జిల్లాలో భారీ మోసం

Siva Kodati |  
Published : Dec 14, 2022, 03:15 PM IST
పది కార్డులతో .. నిమిషాల వ్యవధిలో లక్షల్లో నగదు విత్ డ్రా , ఎన్టీఆర్‌ జిల్లాలో భారీ మోసం

సారాంశం

ఎన్టీఆర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నంలో ఓ వ్యక్తి ఏకంగా పది ఏటీఎం కార్డులను ఉపయోగించి రూ.10 వేల చొప్పున రూ.2.09 వేలు డ్రా చేసుకున్నాడు.   

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ వ్యక్తి ఏకంగా పది ఏటీఎం కార్డులను ఉపయోగించి భారీ మోసానికి పాల్పడ్డాడు. రూ.10 వేల చొప్పున ఏకంగా రూ.2.09 వేలు డ్రా చేసుకున్నాడు. అందరిలాగే డబ్బులు డ్రా చేస్తున్నట్లు నటిస్తూ.. ఏటీఎం దగ్గర మరో వ్యక్తి సాయంతో చోరీ చేశాడు. ఒకేసారి ఇలా డబ్బులు డ్రా చేయడంతో అనుమానాస్పద ట్రాన్సాక్షన్‌గా బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్డుల క్లోనింగ్ జరిగిందా లేక మరేదైనా మార్గంలో ట్రాప్ చేశారా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. నగదు డ్రా చేసిన కార్డులు ఎవరివి..? ఎలా విత్ డ్రా చేశారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Wine Shop: మందు బాబుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వైన్స్ ఓపెన్
Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu