మహిళతో అక్రమ సంబంధం.. ఆమె కూతురిపై కన్నేసి..

Published : Apr 23, 2021, 08:27 AM ISTUpdated : Apr 23, 2021, 08:32 AM IST
మహిళతో అక్రమ సంబంధం.. ఆమె కూతురిపై కన్నేసి..

సారాంశం

ఈ విషయం బాలిక తన తల్లి దగ్గర వాపోతే.. సహాయం చేయాల్సిన తల్లి.. దారుణంగా ప్రవర్తించింది. ఈ విషయం బయటకు చెప్పొద్దంటూ కూతురినే బెదిరించింది. 

రెండు సంవత్సరాలుగా ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు మహిళ కూతురిపై కూడా కన్నేశాడు. మహిళ లేని సమయంలో ఆమె కూతురిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తనకు లొంగిపోవాలంటూ.. బెదిరించడం మొదలుపెట్టాడు. 

ఈ విషయం బాలిక తన తల్లి దగ్గర వాపోతే.. సహాయం చేయాల్సిన తల్లి.. దారుణంగా ప్రవర్తించింది. ఈ విషయం బయటకు చెప్పొద్దంటూ కూతురినే బెదిరించింది. దీంతో.. బాలిక ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అద్దంకి పట్టణానికి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. బాలిక.. ఓ ప్రైవేట్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతోంది. కాగా.. కొంత కాలం క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కూతురు మాత్రం తల్లితోనే ఉంటోంది.

కాగా.. తల్లి చినగంజాంకు చెందిన జానకి రామయ్య అనే వ్యక్తితో కొద్దికాలంగా సహజీవనం చేస్తోంది. అతను మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే.. ఆమె కూతురు పై కూడా  కన్నేశాడు. బాలికను కూడా తాను దక్కించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.

ఆ వేధింపులు తట్టుకోలేకపోయిన బాలిక.. తల్లి దగ్గర వాపోయింది. సహాయం చేయాల్సిన తల్లి.. కూతురిని నోరు మూసుకోవాలని బెదిరించి.. తిరిగి దండించడం గమనార్హం. తల్లి ప్రవర్తను విస్తుపోయిన బాలిక ధైర్యం చేసి పోలీసులను ఆశ్ఱయించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?