భార్యను కాదని ప్రియురాలితో ప్రేమాయణం..చివరకు

By telugu news teamFirst Published Feb 11, 2021, 10:37 AM IST
Highlights

ఈ క్రమంలో భర్త చనిపోయి ఒక కొడుకు ఉన్న నాగజ్యోతి అనే మహిళ పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పృథ్వీ, నాగజ్యోతి 2019 జనవరిలో విజయవాడ కనకదుర్గ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. 

అతనికి అప్పటికే పెళ్లయ్యింది. భార్య కూడా ఉంది. కానీ.. ఆమెను కాదని మరో యువతి వెంట పడ్డాడు. చివరకు ఆ ప్రియురాలితో కలిసి బలవనర్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హనుమాన్‌పాడు మండలం ముప్పాళ్లపాడు గ్రామానికి చెందిన గోపాలరెడ్డి ఏకైన కొడుకు పృథ్వీ కుటుంబ పోషణ నిమిత్తం 10 సంవత్సరాల క్రితం పొట్టచేతబట్టి గుంటూరు వచ్చి లాడ్జిలో పనిచేసేవాడు.

అనంతరం మూడు సంవత్సరాల క్రితం తెనాలికి మకాం మార్చి తెనాలిలో కూరగాయల మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భర్త చనిపోయి ఒక కొడుకు ఉన్న నాగజ్యోతి అనే మహిళ పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పృథ్వీ, నాగజ్యోతి 2019 జనవరిలో విజయవాడ కనకదుర్గ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. 

ఆ తర్వాత లాక్‌డౌన్‌ రావడంతో ఉపాధి కోల్పోవటంతో నాగజ్యోతి హైదరాబాద్‌లో ఉంటున్న తన స్నేహితురాలు జాన్‌కు ఫోన్‌ చేసింది. ఆమె హైదరాబాద్‌ వచ్చేయమని చెప్పటంతో నాగజ్యోతి భర్త పృథ్వీ హైదరాబాద్‌ వెళ్లి జాన్‌ భర్త సుభాష్‌కు చెందిన పండ్ల దుకాణంలో పనిచేసేవాడు. ఆ సమయంలో జాన్‌ మొదటి భర్త కుమార్తె పర్ఖానా(18) కూడా పండ్ల దుకాణంలో పనిచేసేది. ఈ క్రమంలో పృథ్వీ, పర్ఖానా మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది.

2021 జనవరి 12న పర్ఖానాను తీసుకొని పృథ్వీ హైదరాబాద్‌ నుంచి వెళ్లడంతో, ఈసీఐఎల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జనవరి 20న పృథ్వీని, పర్ఖానాను తీసుకువచ్చి పర్ఖానా తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం పృథ్వీని, నాగజ్యోతిని అక్కడ నుంచి పంపించివేయగా, తిరిగి మరలా ఫిబ్రవరి 1వ తేదీన పృథ్వీ పర్ఖానాను తీసుకుని హైదరాబాద్‌ నుంచి వచ్చేశారు. 

ఈ నేపథ్యంలో మంగళవారం పృథ్వీ తండ్రి గోపాలరెడ్డికి ఫోన్‌ చేయగా, ఆయన నీ వల్ల మా పరువు పోతుంది, ఎవరో ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని అనడంతో, పృథ్వీ, పర్ఖానా ఆత్మహత్యకు పాల్పడ్డారు. పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందగా, పర్ఖానా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ తెలియజేశారు. పృథ్వీ మృతదేహానికి పంచనామా నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించామని ఆయన తెలిపారు.

click me!