రుణాల ఎగవేత కేసు: సుజనా చౌదరికి ఈడీ నోటీసులు

By Siva KodatiFirst Published Feb 10, 2021, 10:20 PM IST
Highlights

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. బ్యాంకుల నుంచి రుణాల్ని తీసుకుని మోసం చేసిన కేసులో సుజనా చౌదరి విచారణ ఎదుర్కొంటున్నారు.

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. బ్యాంకుల నుంచి రుణాల్ని తీసుకుని మోసం చేసిన కేసులో సుజనా చౌదరి విచారణ ఎదుర్కొంటున్నారు.

ఆంధ్రాబ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను మోసం చేసి తీసుకున్న రుణాల్ని చెల్లించకుండా ఎగ్గొట్టిన కేసులో సుజనా చౌదరి అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 12వ తేదీన విచారణకు హాజరుకావల్సిందిగా ఆదేశించింది. సూట్‌కేస్ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు సుజనా చౌదరిపై అభియోగాలున్నాయి.

అన్ని బ్యాంకులతో కలిపి మొత్తం 5 వేల 7 వందల కోట్ల మేర రుణాల ఎగవేతకు పాల్పడ్డారని ఈడీ సుజనా చౌదరిపై కేసులు నమోదు చేసింది. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సుజనా అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఈడీ ఆరోపిస్తోంది.

దీనికి సంబంధించి సీబీఐ ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్‌‌లు నమోదు చేసింది. 2018లో సీబీఐ సుజనా ఆస్థులపై సోదాలు నిర్వహించింది. 126 షెల్ కంపెనీలు సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు ఆధారాల్ని సేకరించింది.

ఇందులో సెంట్రల్ బ్యాంకు నుంచి 133 కోట్లు, ఆంధ్రా బ్యాంకు నుంచి 71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి 159 కోట్లు మోసం చేసినట్టు ఉంది. దీనిపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈడీ ఫిబ్రవరి 12న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపింది. 
 

click me!