అమ్మలా పెంచిన అత్తను బంధించి.. ‘ఆస్తి రాసిస్తావా.. గ్యాస్ సిలిండర్ పేల్చి చంపేయాలా?..’ అల్లుడి ఘాతుకం..

Published : Sep 02, 2021, 11:38 AM IST
అమ్మలా పెంచిన అత్తను బంధించి.. ‘ఆస్తి రాసిస్తావా.. గ్యాస్ సిలిండర్ పేల్చి చంపేయాలా?..’ అల్లుడి ఘాతుకం..

సారాంశం

మేనత్త గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం వేమవరంలో ఉంటుంది. బుధవారం ఉదయం వెంకటరెడ్డి వేమవరం వెళ్ళాడు. తనతో పాటు సంతమాగులూరు రావాలని లేకుంటే కొట్టి చంపుతానని బెదిరించి సొంతింటికి తీసుకువచ్చాడు.  ఆస్తి అంతా తన పేరున రాయలని.. లేకుంటే గ్యాస్ సిలిండర్ పేల్చి తగలబెట్టేస్తానని బెదిరించాడు. 

అమ్మలా ఆలనాపాలనా చూసిన అత్తనే అంతమొందించేందుకు సిద్ధమయ్యాడు ఓ ఓ కర్కశుడు.  కిడ్నాప్ చేసి ఇంట్లో బంధించి సిలిండర్ తో తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.  

ఎస్ఐ వి. శివన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న అట్లా బాలిరెడ్డి గతంలో హత్యకు గురయ్యాడు.  ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు చిన్న వెంకటరెడ్డి ఉన్నాడు,  తండ్రి చనిపోవడంతో మేనత్త మందాల బాలేశ్వరి అతడి మంచి చెడులను చూసి పెంచి పెద్ద చేసింది.

మేనత్త గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం వేమవరంలో ఉంటుంది. బుధవారం ఉదయం వెంకటరెడ్డి వేమవరం వెళ్ళాడు. తనతో పాటు సంతమాగులూరు రావాలని లేకుంటే కొట్టి చంపుతానని బెదిరించి సొంతింటికి తీసుకువచ్చాడు.  ఆస్తి అంతా తన పేరున రాయలని.. లేకుంటే గ్యాస్ సిలిండర్ పేల్చి తగలబెట్టేస్తానని బెదిరించాడు. చెప్పిన విధంగానే బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ గదిలో బంధించి ఇనప గ్రిల్స్ కు, ఇంటికి తాళం వేశాడు. ఈ విషయం బాధితురాలి కుమార్తె తెలిసింది.

ఎక్సైజ్ ఎస్సైగా పనిచేస్తున్న ఆమె తన తల్లి కిడ్నాప్ కు గురైన సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించింది.  తక్షణమే స్పందించిన ఎస్ఐ వి. శివన్నారాయణ, ఏఎస్ఐ వెంకటరావు, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ రెడ్డి, కానిస్టేబుల్ ఆంజనేయులు, బలరాంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  గదిలో ఉన్న అతనితో సంప్రదింపులు జరిపారు. దాదాపు గంటన్నర శ్రమించి ఇంటి వెనుక వైపు నుంచి చాకచక్యంగా లోపలికి ప్రవేశించారు.

 ఇది గమనించిన నిందితుడు పోలీసుల పై దాడికి  దిగాడు.  అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్  పేల్చేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకొని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Strong Warning: మనం విలీనం చెయ్యకపోతే చంద్రబాబు ఆర్టీసీ ని అమ్మేసేవారు| Asianet News Telugu
YS Jagan Speech: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్‌ | YSRCP | Asianet News Telugu