నడుస్తున్న రైళ్లో నుంచి గర్భిణిని కిందికి తోసి, గర్భస్రావం.. నిందితుడికి జీవితఖైదు..

Published : Jul 23, 2021, 10:44 AM IST
నడుస్తున్న రైళ్లో నుంచి గర్భిణిని కిందికి తోసి, గర్భస్రావం.. నిందితుడికి జీవితఖైదు..

సారాంశం

అనంతపురం దాటిన తర్వాత.. రైలు తక్కువ వేగంతో వెళ్తున్న సమయంలో ఓ దొంగ ఆమెను భోగి నుంచి కిందికి తోసివేయడంతోపాటు.. తాను కిందికి దూకేశాడు. బాధితురాలిని ముళ్లపొదల్లోకి లాక్కు వెళ్ళాడు. అక్కడ ఆమె బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. 

అనంతపురం : నడుస్తున్న రైల్లో నుంచి గర్బిణిని కిందకి తోసి వేసి చోరీకి పాల్పడిన కేసులో నిందితుడు వేలాయుధం రాజేంద్రన్ కు జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం మహిళా న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించింది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు 2018 డిసెంబర్ 18న గుంటూరుకు చెందిన దివ్యశ్రీ విజయవాడ నుంచి బెంగళూరుకు కొండవీడు ఎక్స్ప్రెస్ లో బయలుదేరింది.

అనంతపురం దాటిన తర్వాత.. రైలు తక్కువ వేగంతో వెళ్తున్న సమయంలో ఓ దొంగ ఆమెను భోగి నుంచి కిందికి తోసివేయడంతోపాటు.. తాను కిందికి దూకేశాడు. బాధితురాలిని ముళ్లపొదల్లోకి లాక్కు వెళ్ళాడు. అక్కడ ఆమె బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. 

బలంగా కిందికి తోసి వేయడంతో అక్కడే ఆమెకు గర్భస్రావం జరిగింది. అనంతరం పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంది. జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చెన్నై సమీపంలోని తిర్ విర్ కాడ్ గ్రామానికి చెందిన వేలాయుధం రాజేంద్రన్ గా గుర్తించారు. 2019 జనవరి 2న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అప్పటినుంచి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్