విద్యార్థుల మధ్య గొడవ: 17 ఏళ్ల బాలుడిని నరికి చంపి, లొంగిపోయిన నిందితుడు

Published : Jul 23, 2021, 07:04 AM IST
విద్యార్థుల మధ్య గొడవ: 17 ఏళ్ల బాలుడిని నరికి చంపి, లొంగిపోయిన నిందితుడు

సారాంశం

విద్యార్థుల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. గు్టూరు జిల్లా ముప్పాళ్ల గ్రామంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఓ విద్యార్థి పెద్దనాన్న మరో విద్యార్థిని చంపి పోలీసులకు లొంగిపోయాడు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ముప్పాళ్ల లో దారుణం చోటుచేసుకుంది.  17 ఏళ్ల బాలుడిని కత్తి తో నరికి చంపి ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఈ హత్యకు దారి తీసింది.

గ్రామానికి చెందిన హాఫ్రిద్(17), సుభాని (16) స్నేహితులు మధ్య ఘర్షణ చిలికి చీలికి గాలివానలా మారింది. అటుగా వస్తున్న బాలుడు హాఫ్రిద్ పై సుభాని పెద్ద నాన్న కత్తితో దాడి చేశాడు.  దాడిలో తీవ్రంగా గాయపడిన హాఫ్రిద్ ను నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు..

ముద్దయి పెద్ద బాజి ముప్పాళ్ల పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు  పికెట్ ఏర్పాటు చేశారు.

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?