వడ్డీ వ్యాపారుల వేధింపులు: సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య

Siva Kodati |  
Published : Jan 28, 2020, 05:54 PM IST
వడ్డీ వ్యాపారుల వేధింపులు: సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య

సారాంశం

వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి. తాజాగా వారి వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి. తాజాగా వారి వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కుంతలగూడెనికి చెందిన గౌరు శ్రీను ఆర్ధిక అవసరాల కోసం ఓ వడ్డీ వ్యాపారి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారి వేధింపులు ఎక్కువ కావడంతో శ్రీను మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి షేర్ చేశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం