ఢీల్లీకి తీర్మానం:ఇక ఏపీ శాసనమండలి రద్దు కేంద్రం చేతుల్లోనే

By narsimha lode  |  First Published Jan 28, 2020, 2:14 PM IST

ఏపీ శాసన మండలి రద్దు కోరుతూ ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానం కాపీ కేంద్రానికి మంగళవారం నాడు చేరింది. 



అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు విషయంలో ఏపీ శాసనసభ చేసిన తీర్మానం ప్రతిని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మంగళవారం నాడు మధ్యాహ్నానికి ఈ తీర్మానం ప్రతి కేంద్రానికి చేరింది.

also read:ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్: ఆ ముగ్గురు ఏం చేశారో తెలుసా?

Latest Videos

undefined

ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ  ఏపీ శాసనసభ ఈ నెల 27వ తేదీన తీర్మానం చేసింది. మండలిని రద్దు కోరుతూ 133 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు చేశారు. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా కానీ, తటస్థంగా కానీ ఎవరూ కూడ ఓటు చేయలేదు.

ఏపీ అసెంబ్లీలో జరిగిన అసెంబ్లీ తీర్మానం కాపీని ఏపీ అసెంబ్లీ  కార్యాలయం ఈ నెల  27వ తేదీ రాత్రే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.  రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయకుండానే  కేంద్రానికి పంపింది.

కేంద్ర హోంశాఖ,  కేంద్ర ఎన్నికల సంఘానికి  ఏపీ ప్రభుత్వం పంపింది. ఈ తీర్మానం కాపీ ఇప్పటికే ఢిల్లీకి చేరింది.. అయితే ఈ తీర్మానంపై  కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి పంపనున్నారు.

ఈ తీర్మానంపై ఏం చేయాలనే దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. రాజ్యాంగంలోని  ఆర్టికల్ 169 ప్రకారం శాసనమండలిని పునరుద్దరణ లేదా రద్దు చేసే అవకాశం ఉంటుంది.

ఈ ఏడాది పిబ్రవరి 1వ తేదీ నుండి  కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోపుగానే ఈ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపచేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం హుటాహుటిన కేంద్రానికి ఈ తీర్మానాన్ని పంపినట్టుగా సమాచారం.
 

click me!