భార్యతో చనువుగా ఉన్నాడని పక్కింటి యువకుడి దారుణ హత్య...

Published : Mar 11, 2022, 10:29 AM IST
భార్యతో చనువుగా ఉన్నాడని పక్కింటి యువకుడి దారుణ హత్య...

సారాంశం

వివాహేతర సంబంధం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. భార్యతో చనువుగా ఉండొద్దని చెప్పినా వినడం లేదని ఓ పక్కింటి యువకుడిని చంపేశాడు ఓ భర్త. 

ప్రకాశం : భార్యతో చనువుగా ఉంటున్న పక్కింటి యువకుడిని husband పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో దారుణంగా murder చేశారని దర్శి డిఎస్పి నారాయణస్వామి రెడ్డి పేర్కొన్నారు, prakasam జిల్లా దర్శి మండలం వెంకటాచలం పల్లి పంచాయతీ పరిధిలోని నడిమిపల్లిలో ఈనెల 7న జరిగిన యువకుని హత్య కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను arrest చేసినట్లు తెలిపారు. బుధవారం దర్శి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి వెల్లడించారు. వివరాల్లోకి వెళితే నడింపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సత్యనారాయణ.. అదే గ్రామానికి చెందిన బోనం బాల చెన్నయ్య భార్య శివ కుమారితో చనువుగా ఉంటున్నాడు.

ఈ విషయం బాలచెన్నయ్యకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని సత్యనారాయణను పలుమార్లు హెచ్చరించాడు. ఈనెల 6వ తేదీ రాత్రి శివ కుమారి, సత్యనారాయణ చనువుగా ఉండటాన్ని గమనించిన బాల చెన్నయ్య కోపోద్రిక్తుడయ్యాడు. సత్యనారాయణను అడ్డు తొలగిస్తే తప్ప తన సంసారం బాగుపడదని నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని తన  బంధువుల దృష్టికి తీసుకువెళ్లి ఆవేదన చెందాడు. ఈనెల ఏడవ తేదీన సత్యనారాయణ తన కనకాంబరాల తోటకువెళ్లి వస్తుండగా బాల చెన్నయ్య,  అతడి బంధువులు కలిసి కత్తి, గడ్డపార, బండరాళ్లతో దాడి చేసి  తీవ్రంగా గాయపరిచారు. రోడ్డుపై పడిపోయిన సత్యనారాయణను బంధువులు గమనించి వైద్యశాలకు తీసుకెళ్ళి మృతిచెందాడు.

అతని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు బోనం బాల చెన్నయ్యతో పాటు అతనికి సహకరించిన భోజనం చిన్నవీరయ్య, బోనం శివకుమారి, ఇ బోనం వెంకటలక్ష్మి, బోనం అంకమ్మ, పుప్పాల అంకమ్మ, పుప్పాల వెంకటేశ్వర్లు, పార్శ్వపు హనుమంతు బుధవారం అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

ఇదిలా ఉండగా, మంగళగిరి మండలంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు గురువారం ఉదయం rape చేసేందుకు యత్నించాడు. అమ్మమ్మ ఇంటికి నడిచి వెళుతున్న ఆ చిన్నారిని కార్తీక్ అలియాస్ సురేష్ అనే యువకుడు తాను ఎత్తుకుని తీసుకు వెళతాను అంటూ మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న అరటి తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. minor girl బిగ్గరగా ఏడవడంతో కొందరు కూలీలు అక్కడికి వచ్చి యువకుడికి దేహశుద్ధి చేశారు. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!