ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. యువకుడికి దేహశుద్ధి..

Published : Mar 11, 2022, 09:50 AM IST
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. యువకుడికి దేహశుద్ధి..

సారాంశం

కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నారులను కూడా వదలడం లేదు. ముద్దులొలికే చిన్నారులను చూసి మురిసిపోవాల్సింది పోయి.. వారిని కామదృష్టితో చూస్తున్నారు. 

గుంటూరు : మంగళగిరి మండలంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు గురువారం ఉదయం rape చేసేందుకు యత్నించాడు. అమ్మమ్మ ఇంటికి నడిచి వెళుతున్న ఆ చిన్నారిని కార్తీక్ అలియాస్ సురేష్ అనే యువకుడు తాను ఎత్తుకుని తీసుకు వెళతాను అంటూ మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న అరటి తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. minor girl బిగ్గరగా ఏడవడంతో కొందరు కూలీలు అక్కడికి వచ్చి యువకుడికి దేహశుద్ధి చేశారు. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, జనవరి 22న visakhapatnamలో దారుణం జరిగింది.. ‘అన్నయ్యా..’ అని పిలిచినా కనికరించలేదు.. కాళ్ళ వేళ్ళు పడ్డ వదిలిపెట్టలేదు.. నోరెత్తితే.. చంపేస్తానని కత్తితో బెదిరించాడు. ‘అన్నయ్యను కాదు, మావయ్య అవుతా’’ అంటూ.. సినిమా డైలాగులు కొడుతూ..  అభం శుభం తెలియని 11యేళ్ల చిన్నారిపై Sexual assault చేశాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి నక్కపల్లి మండలం రాజపేటలో జరిగింది.  11 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన  నాగేష్ (22) అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాధితురాలి ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…

బాధిత బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. వంట చెరుకు కోసం ఆమె సోదరి పక్కనే ఉన్న Cashew gardenకి వెళ్ళింది. ఆమెకు సహాయపడేందుకు బాధితురాలు కూడా తోటకు బయలుదేరింది. ఈ విషయం గమనించిన నిందితుడు ఆమె వెంట వెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి.. తోటలోకి లాక్కెళ్లాడు. తర్వాత బాలిక మీద అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. నగ్నంగా ఫొటోలు, వీడియో తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని  కత్తితో బెదిరించాడు.  

అంతేకాకుండా బాధితురాలి సోదరిని, తల్లిని సైతం స్నానం చేసేటప్పుడు వీడియోలు తీసి తన నిమొబైల్ కి పంపించాలి అని చెప్పాడు. అలా ఆ బాలికను నాలుగు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. ఎవరికీ చెప్పనని ఒదిలి పెట్టాలంటూ ఆ చిన్నారి కాళ్లావేళ్లా పడడంతో.. రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటి వద్ద వదిలి వెళ్ళాడు.

తన చిన్న కుమార్తె కనిపించలేదని కంగారుగా వెతుకుతున్న తల్లిదండ్రులు…  ఎట్టకేలకు ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆమె చెప్పిన విషయం విని వారి గుండెలు బద్దలైపోయాయి. వెంటనే బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్యపరీక్షల కోసం..  విశాఖ కేజీహెచ్కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం సెక్షన్ 5 (ఎం), (హెచ్), ఆర్ డబ్ల్యు 6, సెక్షన్ 12 కింద,  ipc  376 (ఎఫ్), 323, 506 సెక్షన్ల కింద  కేసు నమోదు చేశామని సీఐ నారాయణరావు తెలిపారు.

రాత్రి స్టేషన్కు వెళితే పొద్దున రమ్మన్నారు.. బాధితుల ఆవేదన…
తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు గురువారం రాత్రి పోలీస్ స్టేషన్కు వెళితే.. పోలీసులు వెంటనే స్పందించలేదని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై సీఐ నారాయణరావును వివరణ కోరగా  రాత్రి స్టేషన్ కు వచ్చిన సంగతి తనకు ఉదయం తెలిసిందని,  రాతపూర్వక ఫిర్యాదుతో రాకపోవడంతో ఉదయం రమ్మని పోలీస్స్టేషన్ సిబ్బంది చెప్పి ఉండవచ్చు అని అన్నారు.  తనకు సమాచారం తెలిసిన వెంటనే నిందితుడు ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నామన్నారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu