భార్య పుట్టినరోజు వేడుకలో భర్త హతం.. !!

Published : Mar 20, 2021, 09:48 AM IST
భార్య పుట్టినరోజు వేడుకలో భర్త హతం.. !!

సారాంశం

భార్య పుట్టినరోజు వేడుకల్లో భర్త హత్యకు గురైన ఘటన చిన్నముషిడివాడ పాత ఊరులో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పెందుర్తి సీఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెం ఊర్వశి కూడలి ప్రాంతానికి చెందిన కొత్తపల్లి చిన్నకు చిన్నముషిడివాడకు చెందిన యువతితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి సంతానం కలగలేదు. దీంతో భార్యాభర్తలిద్దరూ చిన్నముషిడివాడలోని యువతి పుట్టింటికి వచ్చి ఉంటున్నారు. యువతి తల్లి కొత్తపల్లి శంకర్ అనే వ్యక్తితో 18 ఏళ్లుగా సహజీవనం చేస్తూ, కలిసి ఉంటోంది. అప్పటికే భార్యను వదిలేసిన శంకర్ కు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.

గురువారం యువతి పుట్టిన రోజు కావడంతో భర్త చిన్న, శంకర్, ఆయన కుమారుడు అశోక్, ఇతర బంధువులు మద్యం తాగారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె సోదరుడి వరసైన అశోక్ తో మద్యం మత్తులో ఉన్న చిన్నా గొడవపడ్డాడు. శంకర్ వారిద్దరిని విడిపించేందుకు ప్రయత్నించగా శంకర్ను చిన్న కొట్టాడు. 

దీంతో అశోక్ సమీపంలో ఉన్న ఇనపరాడ్ తో చిన్న తలపై పలుమార్లు మోదాడు. తీవ్ర రక్తస్రావమైన చిన్నా అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. నిందితులు శంకర్, అశోక్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu