సీబీఐ, ఈడీ కోర్టుల్లో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

Siva Kodati |  
Published : Mar 19, 2021, 09:26 PM IST
సీబీఐ, ఈడీ కోర్టుల్లో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

సారాంశం

సీబీఐ, ఈడీ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. లేపాక్షి ఛార్జ్‌షీట్‌లో బీపీ ఆచార్యపై పీసీ చట్టం సెక్షన్లు నమోదు చేశారు. 

సీబీఐ, ఈడీ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. లేపాక్షి ఛార్జ్‌షీట్‌లో బీపీ ఆచార్యపై పీసీ చట్టం సెక్షన్లు నమోదు చేశారు.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2)ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో సీబీఐ కోర్టుకు బీపీ ఆచార్య హాజరయ్యారు. కొత్త సెక్షన్లపై హైకోర్టుకు వెళ్లేందుకు ఆచార్య న్యాయస్థానాన్ని సమయం కోరారు.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు విచారణ ఈ నెల 26కి కోర్టు వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్, ఇందూటెక్ జోన్ కేసులు ఈ నెల 26కి కోర్టు వాయిదా వేసింది. అరబిందో, హెటిరో, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసులు ఈ నెల 26కు, రఘురాం సిమెంట్స్ కేసు ఈ నెల 22కి, దాల్మియా కేసు ఏప్రిల్ 9కి, ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈ నెల 30కి కోర్టు వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం