తొమ్మిదేళ్లుగా సహజీవనం.. పెళ్లి చేసుకోమన్నందుకు కత్తితో దాడి చేసిన ప్రియుడు..!

By AN TeluguFirst Published Sep 13, 2021, 9:29 AM IST
Highlights

పెళ్లికి ముందు నుంచి కమలకు టెక్కలి మండలంబొరిగిపేట  గ్రామానికి చెందిన రైల్వే గేట్మన్ సంపతి రావు దేవరాజు తో పరిచయం ఉంది. అతడిని నమ్ముకుని 2012లో భర్త పిల్లలను వదిలి టెక్కలి వచ్చేసింది.  దేవరాజు భార్యాపిల్లలు ఉండడంతో ఈమెను స్థానిక ఎన్టీఆర్ కాలనీ 9వ లైన్ లో అద్దె ఇంట్లో ఉంచాడు.  అయితే తొమ్మిదేళ్ల అవుతున్న కమలను దేవరాజు పెళ్లి చేసుకోలేదు.

శ్రీకాకుళం : వివాహేతర సంబంధం కోసం ఓ మహిళ తన సంసారాన్ని బుగ్గిపాలు చేసుకుంది. అంతేకాదు..  భర్త, పిల్లలను వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం జరిగింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుందనే కోపంతో ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.  ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బొరిగిపేట గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.  బాధితురాలు,  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 

టెక్కలి మండలం గంగాధర పేట గ్రామానికి చెందిన  కొప్పల కమలకు  2005లో అదే గ్రామానికి చెందిన సింగుమహంతి భుజంగరావుతో వివాహం జరిగింది.  మీరు హైదరాబాదులో పనులు చేసుకుని జీవించేవారు. వీరికి ఇద్దరు కుమారులు  చరణ్,  హర్షవర్ధన్ ఉన్నారు.  

అయితే పెళ్లికి ముందు నుంచి కమలకు టెక్కలి మండలంబొరిగిపేట  గ్రామానికి చెందిన రైల్వే గేట్మన్ సంపతి రావు దేవరాజు తో పరిచయం ఉంది. అతడిని నమ్ముకుని 2012లో భర్త పిల్లలను వదిలి టెక్కలి వచ్చేసింది.  దేవరాజు భార్యాపిల్లలు ఉండడంతో ఈమెను స్థానిక ఎన్టీఆర్ కాలనీ 9వ లైన్ లో అద్దె ఇంట్లో ఉంచాడు.  అయితే తొమ్మిదేళ్ల అవుతున్న కమలను దేవరాజు పెళ్లి చేసుకోలేదు.

ఈ విషయాన్ని ప్రస్తావించి నప్పుడల్లా ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. దీంతో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన దేవరాజు ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. శుక్రవారం రాత్రి కమల ఇంటికి వెళ్లి పెద్దమనుషుల దగ్గర సమస్య పరిష్కరించుకుందాం అని నమ్మించి  బైక్ పై బొరిగిపేట గ్రామానికి తీసుకెళ్లాడు.

ఏడాదిన్నరగా కన్న కూతురిపై తండ్రి అత్యాచారం..!

నిన్ను చంపేస్తే కానీ హాయిగా ఉండలేనంటూ ఇంట్లో నుంచి కత్తి తెచ్చేసరికి కమల భయంతో అక్కడినుంచి పరుగులు తీసింది. దేవరాజు కూడా వెంబడించి గ్రామ సమీపంలో వంశధార కాలువ వద్ద కత్తితో ఆమెపై దాడి చేసి చేతులు, ఒంటిపై నరకడంతో తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయింది. కమల చనిపోయిందని భావించిన దేవరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

కొంత సమయానికి ఆమె సీతాపురం గ్రామానికి చేరుకుంది.  స్థానికుల సహకారంతో 108కి ఫోన్ చేయడంతో సిబ్బంది వచ్చి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహారాజ్‌ వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై  టెక్కలి సీఐ  ఆర్.నీలయ్య  వివరాలు సేకరించారు.  కమలను గాయపరచిన వారిలో  దేవరాజు తో పాటుగా  మరో వ్యక్తి ఉన్నాడని  బాధితురాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దేవరాజు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ నీలయ్య, ఎస్సై కామేశ్వర రావు తెలిపారు. 

click me!