ట్రిపుల్ రైడ్ .. ఆపై 120 స్పీడ్: డివైడర్‌ను ఢికొట్టిన బైక్ ముగ్గురు యువకులు దుర్మరణం

Siva Kodati |  
Published : Sep 12, 2021, 08:35 PM ISTUpdated : Sep 12, 2021, 08:36 PM IST
ట్రిపుల్ రైడ్ .. ఆపై 120 స్పీడ్: డివైడర్‌ను ఢికొట్టిన బైక్ ముగ్గురు యువకులు దుర్మరణం

సారాంశం

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. పెనుమలూరుకు చెందిన ముగ్గురు యువకులు కొండపల్లి ఖిల్లా నుండి విజయవాడ వస్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. పెనుమలూరుకు చెందిన ముగ్గురు యువకులు కొండపల్లి ఖిల్లా నుండి విజయవాడ వస్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ముగ్గురు యువకులు ట్రిపుల్ డ్రైవ్ చేస్తూ కొండపల్లి నుండి 120 పల్సర్ బైక్ పై విజయవాడ వస్తున్నారు. ఈ క్రమంలో భవానీపురం టర్నింగ్ వద్దకు వచ్చిన తర్వాత బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ప్రమాద సమయంలో బైక్ 120 స్పీడ్‌తో ఉండటంతో బైక్ 50 అడుగుల దూరం దూసుకెళ్లింది. దీంతో బైక్ పై ఉన్న సాధిక్, కార్తిక్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మరణించినట్లుగా తెలుస్తోంది. అనంతరం ప్రమాద ఘటనపై పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతివేగంతో ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!
ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu