ఏడాదిన్నరగా కన్న కూతురిపై తండ్రి అత్యాచారం..!

Published : Sep 13, 2021, 08:40 AM IST
ఏడాదిన్నరగా కన్న కూతురిపై తండ్రి అత్యాచారం..!

సారాంశం

భార్య నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకున్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. భార్య ఇంట్లో లేనప్పుడుల్లా అత్యాచారం చేస్తున్నాడు.

కంటికి రెప్పలా కూతురిని  కాపాడుకోవాల్సిన తండ్రి.. దారుణంగా ప్రవర్తించాడు. కన్న కూతురిపైనే కామాంధుడిలా మారి.. దారుణానికి పాల్పడ్డాడు. ఏడాదిన్నరగా.. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న 35 సంవత్సరాల వయసు ఉన్న ఓ వ్యక్తి వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. ఇతనికి కుమార్తె(13), కుమారుడు (11) సంతానం ఉన్నారు. కాగా కుమార్తె ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. గత ఏడాది మార్చి నెల నుంచి కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడు.

భార్య నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకున్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. భార్య ఇంట్లో లేనప్పుడుల్లా అత్యాచారం చేస్తున్నాడు. ఈ నెల 8, 10వ తేదీల్లోనూ అత్యాచారం చేయడంతో భరించలేని కుమార్తె.. తాను ఇక్కడ ఉండలేనని నానమ్మ ఇంటికి వెళ్లిపోతానని తల్లికి చెప్పింది.

కారణం ఏంటని తల్లి నిలదీయడంతో.. అసలు విషయం బయటపడింది.  తన తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆమె చెప్పడం గమనార్హం. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం ప్రకారం.. ఆమె కేసు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్