ఫోటోలు తీసి, బెదిరించి అత్యాచారం.. గర్భం రావడంతో..

Published : Jun 03, 2020, 01:10 PM ISTUpdated : Jun 03, 2020, 01:12 PM IST
ఫోటోలు తీసి, బెదిరించి అత్యాచారం.. గర్భం రావడంతో..

సారాంశం

వాటిని బాలికకు చూపించి తన కోరిక తీర్చాలని లేదంటే ఫొటోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పెడతానని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. చేసేది లేక ఆమె లొంగిపోయింది. బాలికకు రుతుస్రావం కాకపోవడంతో అనుమానించిన తల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతిగా గుర్తించారు. 

ఓ కామాంధుడు మైనర్ బాలికపై కన్నేశాడు.బాలిక స్నానం చేస్తుండగా యువకుడు సెల్‌లో ఫొటోలు తీసి తన కోరిక తీర్చకపోతే ఫేస్‌బుక్, వాట్సాప్‌లో పెడతానని బెదిరించి... ఆమెను లోబర్చుకున్నాడు. తీరా ఆ కామాంధుడి కారణంగా బాలిక గర్భం దాల్చింది. ఈ సంఘటన విజయనగరంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక స్నానం చేస్తుండగా అదే వెనుక ఇంటిలో ఉన్న చింతపల్లి రాజా అనే 22 ఏళ్ల యువకుడు రెండు నెలల క్రితం సెల్‌లో ఫొటోలు తీశాడు.

వాటిని బాలికకు చూపించి తన కోరిక తీర్చాలని లేదంటే ఫొటోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పెడతానని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. చేసేది లేక ఆమె లొంగిపోయింది. బాలికకు రుతుస్రావం కాకపోవడంతో అనుమానించిన తల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతిగా గుర్తించారు. 

అప్పుడు అసలు విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పగా, ఈ నెల ఒకటో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై బొబ్బిలి డీఎస్పీ మంగళవారం చీపురుపల్లి వచ్చి దర్యాప్తు నిర్వహించారు. యువకుడు రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్