నా స్నేహితుడి కోరిక తీర్చు.. లేదంటే వీడియోలు బయటపెడతా!

Published : May 25, 2020, 07:14 AM IST
నా స్నేహితుడి కోరిక తీర్చు.. లేదంటే వీడియోలు బయటపెడతా!

సారాంశం

ఇంటికి వచ్చిన బాలికను రామయ్య తల్లి నిలదీసింది. దీంతో రామయ్య చీమకుర్తిలో ఒక గది తీసుకుని అందులో బాలికను ఉంచాడు. ఈ క్రమంలో ఆమెపై లైంగికదాడి చేసి, వీడియో తీశాడు. 

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. అతని మాటలను సదరు బాలిక నిజమని నమ్మేసింది. ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కదా అని సర్వం అర్పించుకుంది. తీరా పెళ్లి చేసుకోమంటే కాదన్నాడు. బాలికను ఘోరంగా మోసం చేసిందే కాకుండా.. రివర్స్ లో బ్లాక్ మొయిల్ చేయడం గమనార్హం. ఈ సంఘటన ఒంగోలులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రామయ్య(30) కొంతకాలం క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు బేల్దారి పనులకు వెళ్లాడు. అక్కడ పదహారేళ్ల బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. లాక్‌డౌన్‌ సమయంలో బాలికను తీసుకుని నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. 

ఇంటికి వచ్చిన బాలికను రామయ్య తల్లి నిలదీసింది. దీంతో రామయ్య చీమకుర్తిలో ఒక గది తీసుకుని అందులో బాలికను ఉంచాడు. ఈ క్రమంలో ఆమెపై లైంగికదాడి చేసి, వీడియో తీశాడు. వాటితో ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. తనకు తెలిసిన మరో నలుగురి వద్ద లొంగిపోవాలని, తాను చెప్పినట్లు వినకపోతే వీడియోలు బయటపెడతానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక అక్కడి నుంచి పరారై ఈనెల 10న ఒంగోలు చేరుకుంది. 

అక్కడ లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను క్వారంటైన్‌ సెంటర్‌కు పంపించారు. ఆ సెంటర్‌లో బాలిక మానసికంగా కుంగిపోవడం గుర్తించిన వైద్యుడు శనివారం ఆమెతో మాట్లాడగా.. జరిగినదంతా చెప్పుకుని »బోరుమంది. ఆ విషయాన్ని ఆ వైద్యుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిశ పోలీసులు బాలికను ప్రభుత్వ వైద్యశాలలోని వన్‌స్టాప్‌ సెంటర్‌కు తరలించి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. రామయ్య, అతడి తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu