కట్టుకున్న భార్య, కన్న కొడుకును గొడ్డలితో నరికిచంపిన కిరాతకుడు

Arun Kumar P   | Asianet News
Published : Jun 04, 2021, 05:15 PM IST
కట్టుకున్న భార్య, కన్న కొడుకును గొడ్డలితో నరికిచంపిన కిరాతకుడు

సారాంశం

 కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్య, కన్న కొడుకును గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించాడు ఓ కసాయి.  

కృష్ణా జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్య, కన్న కొడుకును గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించాడు ఓ కసాయి. ఈ దాడిలో అతడి భార్య ప్రాణాలు కోల్పోయింది. 

వివరాల్లోకి వెళితే... టేకుపల్లిలో భార్య పద్మావతి(55), కొడుకు నర్సిరెడ్డి(35) తో కలిసి నివాసముండేవాడు సత్యనారాయణ రెడ్డి. అయితే కొద్దిరోజులుగా ఈ కుటుంబసభ్యుల మద్య వివాదాలు కొనసాగుతున్నాయి. దీంతో భార్యా, కొడుపై కోపాన్ని పెంచుకున్న సత్యనారాయణ దారుణానికి పాల్పడ్డాడు. 

read more మైనర్ బాలికపై అత్యాచారయత్నం... యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు

ఇంట్లోని గొడ్డలితో భార్యను అత్యంత దారుణంగా నరికిచంపిన అతడు కన్న కొడుకుని కూడా హతమార్చడానికి ప్రయత్నించాడు. ఆరుబయట నిద్రిస్తున్న నిద్రిస్తుండగా దాడికి పాల్పడ్డాడు. అయితే తండ్రి చేతిలో దాడికి గురయిన నర్సిరెడ్డి ప్రస్తుతం హాస్పిటల్ లో కొన ఊపిరితో చికిత్స పొందుతున్నారు. పద్మావతి మాత్రం అక్కడికక్కడే చనిపోయింది. 

ఈ హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య అనంతరం హంతకుడు సత్యనారాయణ బైకుపై పారిపోతుండగా రెడ్డిగూడెం శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు