ఆస్తి కోసం కుట్ర.. భార్య, బిడ్డను నిప్పులవాగులోకి తోసి

Published : Sep 04, 2019, 01:22 PM ISTUpdated : Sep 04, 2019, 01:29 PM IST
ఆస్తి కోసం కుట్ర.. భార్య, బిడ్డను నిప్పులవాగులోకి తోసి

సారాంశం

వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో భర్త తనకు అన్యాయం చేశాడని దేవమ్మ పంచాయతీ పెద్దలను ఆశ్రయించింది. దీంతో... వెంకటేశ్వర్లు ఆస్తిని రెండు భాగాలుగా చేసి ఇద్దరు భార్యలకు సమానంగా పంచిపెట్టారు పంచాయతీ పెద్దలు. దీంతో మొదటి భార్య పేరిట రాసిన ఆస్తిని మళ్లీ దక్కించుకోవాలని కుట్ర పన్నాడు.

ఆస్తి కోసం కట్టుకున్న భార్యను, రక్తం పంచుకు పుట్టిన బిడ్డను అతి కిరాతకంగా హత్య చేశాడు. నమ్మకంగా వెంట తీసుకువెళ్లి.. వారిని హతమార్చాడు. గమనించిన స్థానికులు అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించే లోపే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  పాములపాడు మండలం పెంచికలపల్లె గ్రామానికి చెందిన వానాల వెంకటేశ్వర్లు తన భార్య దేవమ్మ(26)తో 9సంవత్సరాల క్రితం వివాహమైంది. కాగా వీరికి  మూడేళ్ల కుమార్తె తేజ ప్రియ కూడా ఉంది. అయితే... ఆడపిల్ల పుట్టిందని వెంకటేశ్వర్లు... దేవమ్మను వదిలించుకోవాలని అనుకున్నాడు.

అందుకే వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో భర్త తనకు అన్యాయం చేశాడని దేవమ్మ పంచాయతీ పెద్దలను ఆశ్రయించింది. దీంతో... వెంకటేశ్వర్లు ఆస్తిని రెండు భాగాలుగా చేసి ఇద్దరు భార్యలకు సమానంగా పంచిపెట్టారు పంచాయతీ పెద్దలు. దీంతో మొదటి భార్య పేరిట రాసిన ఆస్తిని మళ్లీ దక్కించుకోవాలని కుట్ర పన్నాడు.

ఈ క్రమంలో భార్య దేవమ్మ తో మంచిగా నటించడం మొదలుపెట్టాడు. భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్తానంటూ నమ్మించి... భార్యను, కుమార్తెను నిప్పులవాగులోకి తోసేశాడు. గమనించిన స్థానికులు అతనిని పట్టుకనే ప్రయత్నం చేసేలోపు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే