వివాహితతో అక్రమ సంబంధం... అనుమానంతో..

Published : Aug 07, 2020, 08:40 AM ISTUpdated : Aug 07, 2020, 08:43 AM IST
వివాహితతో అక్రమ సంబంధం... అనుమానంతో..

సారాంశం

ఇంటి పక్కనే ఉంటున్న సూర్యారావు అనే వ్యక్తితో ఆమెకు అనుబంమేర్పడింది. మూడేళ్లుగా వీళ్లు తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యింది. అయినా.. భర్తని కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే.. ఆ అక్రమ సంబంధమే ఆమె ప్రాణాలు తీసింది. ఆమె ప్రియుడే.. అనుమానంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తాడేపల్లిగూడేనికి చెందిన రామలక్ష్మి భర్తతో విడిపోయింది. బిడ్డతో కలిసి ఉంగుటూరులో నివసిస్తోంది. ఈ క్రమంలో... ఇంటి పక్కనే ఉంటున్న సూర్యారావు అనే వ్యక్తితో ఆమెకు అనుబంమేర్పడింది. మూడేళ్లుగా వీళ్లు తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే తనతో అక్రమ సంబంధంలో ఉన్న రామలక్ష్మి... మరో వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుందని సూర్యారావు అనుమానించాడు. రోజురోజుకు ఆ అనుమానం బలపడింది. ఈ క్రమంలో... రామలక్ష్మిని చంపివేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే... ఆమెను తీసుకొని సమీపంలోకి అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడే ఆమెను గొంతునులిమి చంపివేశాడు. అంతేకాదు... తను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు... పోలీసులకు సమాచారమందించారు. సూర్యారావును ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు... రామలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu