పెళ్లిరోజున భార్యను హత్య చేసిన భర్త

Published : Jun 11, 2021, 09:30 AM ISTUpdated : Jun 11, 2021, 09:32 AM IST
పెళ్లిరోజున భార్యను హత్య చేసిన భర్త

సారాంశం

అయితే.. పెళ్లైన కొద్ది రోజులకే వారి మధ్య మనస్పర్థలు రావడం మొదలైంది. దీంతో తరచూ భార్యభర్తలు గొడవలు పడుతూ ఉండేవారు.

పెళ్లి రోజున  ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా విసన్నపేట మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... విస్సన్నపేట  మండలంలోని చండ్రుపట్ల తండా పంచాయతీ కొర్ర తండా గ్రామానికి చెందిన కొర్ర దుర్గారావు, ఇదే గ్రామానికి చెందిన లక్ష్మి(24) ని ప్రేమించి.. పెద్దల అనుమతితో గతేడాది పెళ్లి చేసుకున్నారు.

అయితే.. పెళ్లైన కొద్ది రోజులకే వారి మధ్య మనస్పర్థలు రావడం మొదలైంది. దీంతో తరచూ భార్యభర్తలు గొడవలు పడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం వారి మొదటి పెళ్లి రోజు. దీంతో.. కుటుంబసభ్యుల మధ్య  వేడుక చేసుకున్నారు. 

అప్పుడు ఆనందంగానే ఉన్నవారు.. తర్వాత అదే రోజు మరోసారి గొడవ పడ్డారు. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో దుర్గారావు కొట్టిన దెబ్బలకు లక్ష్మీ హఠాన్మరణం చెందగా.. నిందితుడు విసన్నపేట పోలీసుల వద్దకు వచ్చి జరిగిన సంఘటనను వివరించాడు.దీంతో.. అతనిపై హత్య కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు