కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

Siva Kodati |  
Published : Jun 10, 2021, 09:52 PM IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

సారాంశం

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం ఆయనతో చర్చించనున్నారు. 

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం ఆయనతో చర్చించనున్నారు. జగన్‌ అంతకుముందుత కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, గజేంద్ర సింగ్ షెకావత్‌లతో పాటు నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. పోలవరంతో సహా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు.

Also Read:పోలవరంపై అంచనాలు, కాస్త కనికరించండి.. ఇంత భారం మోయలేం: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌తో జగన్

అంతకుముందు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ స్వాగతం పలికారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉ‍న్నారు.

PREV
click me!

Recommended Stories

Police Recruitment : 2026 లోనే తెలుగు యువత కల సాకారం.. ఖాకీ డ్రెస్ వేసి, సింహాల టోపీ పెట్టేందుకు సిద్దమా..?
IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు