లాడ్జికి తీసుకెళ్లి.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం...

Published : Jul 31, 2021, 07:47 AM IST
లాడ్జికి తీసుకెళ్లి.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం...

సారాంశం

నమ్మించి, మత్తు మందు ఇచ్చి, ఓ యువతిపై ఇద్దరు బిడ్డల తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుపతి, అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఓ యువతి తండ్రి ఏడేళ్ల కిందట ప్రమాదంలో మృతి చెందాడు. తల్లి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం చనిపోయింది. 

తిరుపతి :  తల్లిదండ్రులు లేని యువతిపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. నమ్మించి, మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి అప్పటికే పెళ్ళై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు ఎలాగోలా వశపరుచుకుని వారిమీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి 

నమ్మించి, మత్తు మందు ఇచ్చి, ఓ యువతిపై ఇద్దరు బిడ్డల తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుపతి, అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఓ యువతి తండ్రి ఏడేళ్ల కిందట ప్రమాదంలో మృతి చెందాడు. తల్లి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం చనిపోయింది. 

దీంతో కుటుంబ స్నేహితుడు,  మంగళం  బిటిఆర్  కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఆమె నివసిస్తోంది.అదే ప్రాంతానికి చెందిన నాగేంద్రబాబు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతి అలిపిరి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. 28వ తేదీ తనకు మాయమాటలు చెప్పి శ్రీనివాసం సమీపంలోని ఓ లాడ్జీకి నాగేంద్రబాబు తీసుకెళ్లాడని,  అక్కడ మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

 ఈ మేరకు సీఐ  దేవేంద్ర కుమార్  కేసు నమోదుచేసి  దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేంద్ర బాబుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సి ఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Nagababu comments చేసిన “కర్మ’’ము చెడని పదార్థము వైసీపీ పై రెచ్చిపోయిన నాగబాబు | Asianet News Telugu
K. Vijayanand Appointed as CM Ex-Officio Special Chief Secretary | CM Office | Asianet News Telugu