సంక్రాంతి పశువుల పండుగలో విషాదం.. పొట్టేలుకు బదులు మనిషిని నరికాడు....

Published : Jan 17, 2022, 07:10 AM IST
సంక్రాంతి పశువుల పండుగలో విషాదం.. పొట్టేలుకు బదులు మనిషిని నరికాడు....

సారాంశం

ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని వలసపల్లెలో జరిగింది. తరతరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న పండుగ ఆచారం ప్రకారం స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలివ్వడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. అయితే పొట్టేలును నరికే వ్యక్తి కాస్త ఎక్కువగానే తాగి ఉన్నాడు. 

చిత్తూరు : sankranthi festival ఆ కుటుంబంలో విషాదం నింపింది. వ్యవసాయానికి మూలమైన పశువులకు పండుగ చేసుకుని సంబురాలు చేసుకుందామనుకున్న గ్రామంలో కలకలం రేగింది. తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న cattle festivalను వేడుకగా జరుపుకుందామనుకుంటే అంతులేని విషాదం ఆ కుటుంబాన్ని ఆవరించింది. 

ఈ విషాదకర ఘటన Chittoorలో జరిగింది. పశువుల పండుగలో విషాదం చోటు చేసుకుంది. ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో పొట్టేలును Sacrifice చేస్తుండగా.. దాన్ని పట్టుకున్న వ్యక్తి మృతి చెందాడు. బలి ఇచ్చే వ్యక్తి.. liquor మత్తులో పొట్టేలుకు బదులు వ్యక్తి ప్రాణాన్ని తీశాడు. భయాందోళనలు కలిగించేలా ఉన్న ఈ ఘటనలో అక్కడ ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 

ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని వలసపల్లెలో జరిగింది. తరతరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న పండుగ ఆచారం ప్రకారం స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలివ్వడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. అయితే పొట్టేలును నరికే వ్యక్తి కాస్త ఎక్కువగానే తాగి ఉన్నాడు. అది వీరు గమనించుకోలేదో.. లేక కామనే అనుకున్నారో కానీ ఓ వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. 

బలి ఇచ్చే క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలును నరకబోయి.. పొట్టేలును పట్టుకున్న సురేష్ (35) అనే వ్యక్తిని నరికాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసి గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఒక్కక్షణం షాక్ అయ్యారు. ఆ తరువాత ఏడుపులు మిన్నంటాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మూఢనమ్మకాలు, వింత ఆచారాలతో ప్రాణాలను బలితీసుకునే దారుణ ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. నిరుడు డిసెంబర్ లో చెన్నైలో ఓ ఆరునెలల చిన్నారిని ఇలాంటి నమ్మకంతోనే బలి తీసుకున్నారు. తంజావూరు జిల్లాలో మూఢనమ్మకంతో ఆరు నెలల చిన్నారిని human sacrifice ఇచ్చిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 

ఈ వివరాలను పరిశీలిస్తే… జిల్లాలోని సేతుపావసత్రం ప్రాంతానికి చెందిన నజ్రుద్దీన్ (32) అనే మత్స్యకారుడికి భార్య  షాలికా (30),  ఇద్దరు కుమారులు, షాజరా  అనే ఆర్నెల్ల కుమార్తె ఉంది. అయితే, రెండు రోజుల క్రితం ఈ చిన్నారి ఇంటిముందు Water tankలో విగతజీవిగా కనిపించింది. ఆ తర్వాత ఆ చిన్నారికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే,  Six months Toddler నీటితోట్టిలో ఎలా పడింది? అన్న సందేహం ఇరుగుపొరుగు వారికి వచ్చింది. ఈ విషయం పేరావూరణి పోలీసులకు చేరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నజ్రుద్దీన్, షాలికా దంపతులను విచారించగా అసలు విషయం వెల్లడైంది, 

నజ్రుద్దీన్ పిన్ని  షర్మిల బేగం (48)  భర్త అజారుద్దీన్  గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు.  దీంతో మంత్రగాడిని సంప్రదించగా నరబలి ఇస్తే అంతా చక్కబడుతుందని సలహా ఇచ్చాడు. దీంతో Shalika ఆరు నెలల కుమార్తెను  షర్మిల బేగం  నీటి తొట్టెలో పడేసి చంపేసినట్లు  విచారణలో వెల్లడైంది.  అలాగే సమాచారాన్ని పోలీసులకు చెప్పకుండా అంత్యక్రియలు నిర్వహించినందుకు నజ్రుద్దీన్,  ఆయన సోదరుడు  సయ్యద్ ఇబ్రహీం,  షర్మిల బేగం ల ను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu