కరోనా ఎఫెక్ట్: ఈ నెల 17 నుండి శ్రీశైలంలో మల్లన్న సర్వదర్శనం రద్దు

By narsimha lodeFirst Published Jan 16, 2022, 10:28 PM IST
Highlights


కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు విధించారు. సోమవారం నుండి స్వామి సర్వ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ఈవో లవన్న చెప్పారు.

శ్రీశైలం:  corona దృష్ట్యా Srisailam ఆలయంలో ఆంక్షలు విధించారు. సోమవారం నుంచి స్వామివారి సర్వదర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అన్నప్రసాదం, వేదాశీర్వచనం, పుణ్యస్నానాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. devotees ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని కోరారు.

ప్రస్తుతం లఘు దర్శనం మాత్రమే కలిపిస్తున్నామని ఈవో Lavanna చెప్పారు. శఠారి, తీర్థం, ఉచిత ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నామని చెప్పారు. గంటకు కేవలం వెయ్యి మంది భక్తుకు మాత్రమే  దర్శనం కల్పించనున్నామన్నారు. పరిమిత సంఖ్యలోనే ఆర్జిత సేవలు జరుగుతాయని ఈవో తెలిపారు. అందుబాటులో ఉన్న ఆర్జిత సేవల్లో ప్రస్తుతం జారీ చేస్తున్న టికెట్లలో 50 శాతం టికెట్లను మాత్రమే విక్రయించనున్నట్టుగా ఈవో వివరించారు. ఈ నెల 18 నుండి ఆర్జిత సేవా టికెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తామని ప్రకటించారు ఈవో. Online Registration  సమయంలో కరోనా Vaccination వివరాలను నమోదు చేయాలని ఆయన భక్తులకు సూచించారు.సామూహిక ఆర్జిత అభిషేకాలు రోజుకు నాలుగు విడుతలుగా నిర్వహించనున్నట్టుగా ఈవో చెప్పారు. ఒక్కో విడతలో 75 టికెట్లు జారీ చేస్తామన్నారు. టికెట్ల  తీసొన్న భక్తులకు కేవలం స్వామివారి దర్శనం కల్పిస్తామని ఈవో చెప్పారు.

కరోనా నేపథ్యంలో వృద్దులు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు పదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు ఆలయానికి రావొద్దని ఈఓ సూచించారు. తమకు కేటాయించిన సమయానికే ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు భక్తులు రావాలని ఈవో కోరారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న బక్తులను క్యూ లైన్లలో అనుమంతించబోమని ఈవో వివరించారు. క్యూ లైన్లలో ప్రవేశించే ముందు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరన్నారు.

శ్రీశైలంలో ఎక్కువ రోజులు ఉండకూడదని భక్తులకు ఈవో సూచించారు. సాతాళగంగలో స్నానాలను కూడా నిలిపివేస్తున్నామని ఈవో చెప్పారు. రోప్‌వే, బోటింగ్ సైతం కూడా నిలిపివేసినట్టుగా ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.ఈ నెల 18వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని  ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది.
ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణీకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చారు. 

నైట్ కర్ఫ్యూతో పాటు కరోనా ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ.10 నుండి రూ. 15 వేల వరకు ఫైన్ విధించనున్నారు.  షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ఆదేశించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కులు తప్పనిసరి చేసింది జగన్ సర్కార్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు ఈ నెల 17 నుండి యధావిధిగా ప్రారంభించనున్నట్టుగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఏపీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తారని ప్రచారం సాగింది. అయితే విద్యా సంస్థలు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. 

 

 

click me!