ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులనే 4570 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్కరు మరణించారు.రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,510 కి చేరింది.
అమరావతి:Andhra pradesh రాష్ట్రంలో గత 24 గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 4,570 corona కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో30,022 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 4570 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 21,06,280కి చేరుకొన్నాయి.కరోనాతో గత 24 గంటల్లో కరోనాతో ఒక్కరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,510 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 669 మంది Corona నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 65వేల మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 26,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అనంతపురంలో347,చిత్తూరులో 1124, తూర్పుగోదావరిలో233,గుంటూరులో368,కడపలో 173, కృష్ణాలో207, కర్నూల్ లో168, నెల్లూరులో253, ప్రకాశంలో 178,విశాఖపట్టణంలో 1028,,శ్రీకాకుళంలో259, విజయనగరంలో 290,పశ్చిమగోదావరిలో 095కేసులు నమోదయ్యాయి.
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం-1,60,073, మరణాలు 1093
చిత్తూరు-2,55,102, మరణాలు1960
తూర్పుగోదావరి-2,97,070, మరణాలు 1290
గుంటూరు -1,81,618,మరణాలు 1260
కడప -1,17,160, మరణాలు 644
కృష్ణా -1,22,597,మరణాలు 1482
కర్నూల్ - 1,25,357,మరణాలు 854
నెల్లూరు -1,49,155,మరణాలు 1060
ప్రకాశం -1,39,706, మరణాలు 1131
శ్రీకాకుళం-1,25,407, మరణాలు 794
విశాఖపట్టణం -1,64,905 మరణాలు 1143
విజయనగరం -84,497, మరణాలు 673
పశ్చిమగోదావరి-1,80,738, మరణాలు 1126
: 16/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,03,385 పాజిటివ్ కేసు లకు గాను
*20,62,105 మంది డిశ్చార్జ్ కాగా
*14,510 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 26,770 pic.twitter.com/HTbp2DAo7O
ఈ నెల 18వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణీకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చారు.
నైట్ కర్ఫ్యూతో పాటు కరోనా ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ.10 నుండి రూ. 15 వేల వరకు ఫైన్ విధించనున్నారు. షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ఆదేశించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కులు తప్పనిసరి చేసింది జగన్ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు ఈ నెల 17 నుండి యధావిధిగా ప్రారంభించనున్నట్టుగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఏపీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తారని ప్రచారం సాగింది. అయితే విద్యా సంస్థలు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు.
దేశంలో కొత్తగా 2,71,202 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,71,22,164కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో మరో 314 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,86,066కి చేరింది. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,50,85721కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,38,331 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,50,377 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.