
కాకినాడ జిల్లా పిఠాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కోసం బైక్‌పై అన్నవరం వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొట్టింది ప్రేమజంట. తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడివున్న వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే మార్గమధ్యంలోనే యువకుడు మృతి చెందాడు. యువతిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే యువతి తల్లిదండ్రులే వారిపై దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు యువకుడి తల్లిదండ్రులు. ప్రేమ వ్యవహారమే అందుకు కారణంగా తెలుస్తోంది. జగన్నాథపురానికి చెందిన పాలెపు గణేశ్, దీప్తి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రేమ పెళ్లి కోసం అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంపై గణేశ్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి బంధువులపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.