జాలిపడి ఇంట్లో ఆశ్రయమిస్తే: సోదరుని భార్యతోనే అక్రమ సంబంధం..చివరికి

Siva Kodati |  
Published : Apr 15, 2019, 11:57 AM IST
జాలిపడి ఇంట్లో ఆశ్రయమిస్తే: సోదరుని భార్యతోనే అక్రమ సంబంధం..చివరికి

సారాంశం

వరుసకు వదినయ్యే మహిళతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుని హత్యకు గురయ్యాడు. 

వరుసకు వదినయ్యే మహిళతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుని హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పేయలవారిపల్లెకు చెందిన కృష్ణప్పనాయుడు కుమారుడు రవికి వివాహమైంది.

అయితే విభేదాల కారణంగా భార్య అతని నుంచి విడాకులు తీసుకుంది. దీంతో రవి ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రవికి వరుసకు సోదరుడయ్యే అదే గ్రామానికి చెందిన గణపతి భార్య ధనలక్ష్మీ, ఇద్దరు పిల్లలతో కలిసి పీలేరులో నివాసం ఉంటోంది.

అతను లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గణపతి సహృదయంతో రవికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఈ క్రమంలో ధనలక్ష్మీతో రవికి వివాహేతర సంబంధం ఏర్పడింది. గణపతి లారీ డ్రైవర్ కావడంతో వీరి బంధానికి అడ్డు లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో వీరిద్దరూ నాలుగు నెలల క్రితం గణపతికి తెలియకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న గణపతి పిల్లలు బెంగ పెట్టుకున్నారని భార్యకు నచ్చజెప్పి తిరిగి ఇంటికి తీసుకుని వచ్చాడు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన రవి శనివారం పీలేరులోని ఓ లాడ్జీలో ఉండి ధనలక్ష్మీకి ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. ఈ విషయాన్ని ధనలక్ష్మీ.. తన భర్త గణపతికి చెప్పింది.

దీంతో ఇద్దరు కలిసి రవి ఉంటున్న లాడ్జి వద్దకు వచ్చారు. ధనలక్ష్మీని చూసిన రవి ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందంటూ చేయి చేసుకున్నాడు. తన ముందే భార్యపై చేయి చేసుకున్న గణపతి పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో రవి తలపై బలంగా కొట్టాడు.

దీంతో తీవ్ర గాయాలపాలైన రవి అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే