స్నేహితుడిమీద పొసెసివ్ నెస్.. అతని భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులు..

By AN Telugu  |  First Published Sep 2, 2021, 12:27 PM IST

 దేవా గ్లాడ్విన్ స్నేహితుడు గత నెల 7న గుంటూరు జిల్లా కొర్నెపాడుకు చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని వేరుగా కాపురం పెట్టాడు. ఆమె తన మిత్రుడిని దూరం చేస్తోందని దేవా గ్లాడ్విన్ కోపం పెంచుకున్నాడు. 


గుంటూరు : తన మిత్రుడి భార్యను మానసికంగా వేధించిన కేసులో నిందితుడిని చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని దక్షణ మండలి డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జెస్సీ ప్రశాంతి కేసు వివరాలు వెల్లడించారు. యడ్లపాడుకు చెందిన బెజ్జం దేవా గ్లాడ్విన్ 2017లో గుంటూరులోని ఓ కళాశాలలో ఐటీఐ చదివాడు.

ఆ సమయంలో కళాశాలలో ఓ వ్యక్తితో స్నేహం ఏర్పడింది.  ఏడాది జులై నెలలో వారిద్దరూ నెల్లూరె జిల్లా సూళ్లూరుపేటలోని ఓ ద్విచక్రవాహన షోరూంలో పనికి చేరి అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉండేవారు.

Latest Videos

ఇదిలా ఉండగా దేవా గ్లాడ్విన్ స్నేహితుడు గత నెల 7న గుంటూరు జిల్లా కొర్నెపాడుకు చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని వేరుగా కాపురం పెట్టాడు. ఆమె తన మిత్రుడిని దూరం చేస్తోందని దేవా గ్లాడ్విన్ కోపం పెంచుకున్నాడు. 

ఈ నేపత్యంలో అతను తన స్నేమితుడు, భార్య చిత్రాలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఆమెకు, వారి సన్నిహితులకు ఫోన్ లో పంపాడు. ఇలా చేస్తే ఆమె తన మిత్రుడి నుంచి విడాకులు తీసుకుంటుందని భావించాడు. ఇది తెలుసుకన్న బాధితురాలు తన గ్రామానికి వెళ్లినప్పుడు వట్టి చెరుకూరు పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. 

డీఎస్పీ ప్రశాంతి పర్యవేక్షణలో చేబ్రోలు సీఐ కేసు దర్యాప్తు చేపట్టి బుధవారం నగరం పాలెంలోని జిల్లా కోర్టు సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చాకచక్యంగా కేసు దర్యాప్తు చేసిన వట్టి చెరుకూరు ఎస్సై మహేంద్ర, హెచ్ సీ మల్లికార్జునరావు, పోలీసులు రాము, రామచంద్రారెడ్డిని డీఎస్పీ ప్రశాంతి అభినందించారు. 
 

click me!