ఏపీ ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా మరికొందరిపై దాఖలైన కేసులను ఏపీ హైకోర్టు గురువారం నాడు కొట్టివేసింది. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం కేసు పెట్టింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా మరికొందరిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.ఏపీ రాజధాని అమరావతిలో భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ కేసులో స్టే ఉండడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం.
ఏపీ ప్రభుత్వం మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా మరికొందరిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. pic.twitter.com/tEQ1vDXzRE
— Asianetnews Telugu (@AsianetNewsTL)
మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా మరో 12 మందిపై అమరావతి ల్యాండ్ స్కాం లో కేసు నమోదైంది. 2020 సెప్టెంబర్ 15 తేదీన ఈ కేసు నమోదైంది. 409 సెక్షన్ సహా ఐపీసీ 420 ఆర్/డబ్ల్యు, 120 బీ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.తనపై నమోదైన కేసులో జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు 2020 సెప్టెంబర్ 15న స్టే ఇచ్చింది.ఈ విషయమై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకొంది.