పురుషుడికి వితంతు పింఛను.. అధికారుల నిర్వాకం..

By AN TeluguFirst Published Apr 8, 2021, 9:31 AM IST
Highlights

పురుషుడికి వితంతు పింఛన్.. ఆశ్చర్యపోకండీ.. మీరు చదువుతున్నది నిజమే.. పురుషుడికి వితంతు పింఛన్ మంజూరు చేయడమే కాదు.. దాదాపు 12యేళ్లుగా దీనిమీద ఎవ్వరికీ అనుమానం కూడా రాకపోవడం మరీ విచిత్రం..  అయితే ఇలాంటి విచిత్రాలు డోన్ మండలంలో మామూలే అన్నట్టుగా వ్యవహరించారు అధికారులు.. చివరికి విషయం బయటపడడంతో తప్పును గుర్తించి దీనిమీద అధికారులు విచారణ చేపట్టారు.

ఈ ఘటన డోన్ మండలం ఎద్దుపెంటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాశీ అనే వ్యక్తికి పింఛన్ నెంబర్ 113529781 ఐడీతో 2009లోనే పింఛను మంజూరు చేసినట్లు అధికారులు గుర్తించారు. కాశీం ఉపాధి నిమిత్తం కొంతకాలం గుంటూరు జిల్లాకు వలస వెళ్ళాడు. 

వినుకొండ నియోజకవర్గంలోని చిత్తాపురం వెల్ఫేర్ అసిస్టెంట్ వద్దకు ఈ నెల 4న పింఛన్ పొందేందుకు వెళ్ళాడు. అక్కడ కార్డును గుర్తించిన వెల్ఫేర్ అసిస్టెంట్ వితంతు పెన్షన్ నీకు ఎలా వస్తుంది? అని ప్రశ్నించడంతో ఆ వ్యక్తి సరైన సమాధానం చెప్పలేకపోయాడు.

దీంతో అక్కడి అధికారి డోన్ మండలం ఎద్దుపెంట సచివాలయ అధికారులతో పాటు మండల అధికారులకు సమాచారం అందించారు. దీంతో పొరపాటును గుర్తించిన జిల్లా, స్థానిక అధికారులు దీనిపై విచారణ చేసేందుకు చర్యలు చేపట్టారు.

అధికారులు ఎన్నో ఏళ్ల పాటు ఇంత నిర్లక్ష్యంగా పింఛన్ ఎలా ఇచ్చారు, ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా, తదితర విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ  ఘటనపై డీఆర్డీఏ అధికారులు విచారణ చేపట్టారు. అసలు దీన్ని ఎవరు మంజూరు చేశారు? ఇన్నేళ్లు ఎలా పింఛను తీసుకున్నారనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం గ్రామానికి వెళ్లగా అక్కడ సంబంధిత వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో అధికారులు వెనుతిరిగినట్లు కార్యదర్శి మోహన్ ఆచారి తెలిపారు. రెండు నెలలుగా పింఛన్ ఇవ్వడంలేదని కార్యదర్శి మోహన్ ఆచారి తెలిపారు.

click me!