పెరుగుతున్న కరోనా తీవ్రత: శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్.. సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత

By Siva Kodati  |  First Published Apr 7, 2021, 8:12 PM IST

దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. పాఠశాలలు, ఆధ్యాత్మిక కేంద్రాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే దేశంలోని పలు దేవాలయాలను మూసివేశారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది


దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. పాఠశాలలు, ఆధ్యాత్మిక కేంద్రాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే దేశంలోని పలు దేవాలయాలను మూసివేశారు.

ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 12 నుంచి శ్రీవారి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Latest Videos

undefined

ఈ మేరకు బుధవారం సాయంత్రం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం వద్ద భక్తులకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు.

అయితే.. ఈ కౌంటర్ల క్యూలైన్ల వద్దకు భక్తులు భారీగా చేరుతుండటంతో వైరస్ వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని టీటీడీ భావించింది.

ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లను ఈనెల 11వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే జారీ చేస్తామని బోర్డ్ వెల్లడించింది. 12వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

తదుపరి సర్వదర్శన టోకెన్ల జారీపై వివరాలను ముందుగానే తెలియజేస్తామని తెలిపింది. అయితే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది. 
 

click me!