అవతార్ 2 సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి.. ఏపీలో ఘటన

Published : Dec 17, 2022, 01:59 PM IST
అవతార్ 2 సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి.. ఏపీలో ఘటన

సారాంశం

అవతార్ 2 సినిమా చూస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కాకినాడ పెద్దాపురం పటట్ణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  

హైదరాబాద్: అవతార్ 2 సినిమా చూస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యక్తి మరణించాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని లక్ష్మీరెడ్డి శ్రీనుగా గుర్తించారు. 

లక్ష్మీరెడ్డి శ్రీను, సోదరుడు రాజుతో కలిసి అవతార్ 2 సినిమా చూడటానికి ఓ థియేటర్ వెళ్లాడు. సినిమా చూస్తూనే మధ్యలోనే లక్ష్మీరెడ్డి శ్రీనుకు గుండెపోటు వచ్చింది. సినిమా మధ్యలోనే ఆయన కుప్పకూలిపోయాడు. వెంట వచ్చిన తమ్ముడు రాజు.. అతడిని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లాడు. పెద్దాపురం ప్రభుత్వ హాస్పిటల్‌కు అన్నయ్య లక్ష్మీరెడ్డి శ్రీనును తీసుకెళ్లాడు. కానీ, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

లక్ష్మీరెడ్డి శ్రీనుకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.

Also Read: షాకింగ్ న్యూస్.. ఇండియాలో KGF 2 రికార్డు బ్రేక్ చేసిన అవతార్ 2

అవతార్ ఫస్ట్ పార్ట్ సినిమా సమయంలోనూ ఒకరు ఇలాగే గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తైవాన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి అవతార్ ఫస్ట్ పార్ట్ సినిమా చూస్తూ 2010లో గుండెపోటుతో మరణించాడు. అతడికి హైబీపీ ఉన్నది. అవతార్ సినిమా చూసి తీవ్ర ఉద్రేకానికి గురైన కారణంగా ఆ వ్యక్తి మరణించినట్టు అతడిని పరీక్షించిన వైద్యులు అప్పుడు చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే