పామును మెడలో వేసుకుని శివుడిలా ఫోజు.. సెల్ఫీ పిచ్చికి యువకుడు బలి

Siva Kodati |  
Published : Jan 25, 2023, 02:54 PM IST
పామును మెడలో వేసుకుని శివుడిలా ఫోజు.. సెల్ఫీ పిచ్చికి యువకుడు బలి

సారాంశం

నెల్లూరు జిల్లా కందుకూరులో ఓ యువకుడు ఏకంగా పాముతో సెల్ఫీ దిగబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.   

ఇటీవలికాలంలో సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. నీటి ఒడ్డున, బిల్డింగ్ కోసన, జలపాతాల వద్ద, రోడ్డు, రైలు పట్టాల పైనా సెల్పీలు దిగుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కందుకూరులో ఓ యువకుడు ఏకంగా పాముతో సెల్ఫీ దిగబోయి ప్రాణాలు కోల్పోయాడు. పామును మెడలో వేసుకుని సెల్ఫీకి ఫోజులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. అది అతడిని కాటు వేసింది. అతని అరుపులు విన్న స్థానికులు యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

ALso REad: సెల్ఫీ మోజులో ప్రాణాలతో చెలగాటం.. నీట మునిగిన ఇద్దరు యువతులు

ఇకపోతే.. గతేడాది మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వైతర్ణ సేతుపై సెల్ఫీ  కోసం వెళ్లిన నలుగురు మహిళలు కలిసి సెల్ఫీలు దిగుతుండగా కాలుజారి నీటిలో పడిపోయారు. వీరిలో ఇద్దరు నీటిలో మునిగి చనిపోగా, ఇద్దరిని రక్షించారు. మరణించిన మహిళలను నీలా దంసింగ్ దాస్నా (24), సంతు దాస్నా (15)గా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్