కోవిడ్ 19 : ఊపిరాడక కళ్లముందే తండ్రి మృతి.. గుండెలు పగిలేలా కూతురి రోదన.. !! (వీడియో)

Published : May 03, 2021, 12:03 PM IST
కోవిడ్ 19 : ఊపిరాడక కళ్లముందే తండ్రి మృతి.. గుండెలు పగిలేలా కూతురి రోదన.. !! (వీడియో)

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా విలయం జనాల్ని పిట్టల్లా రాలిపోయేలా చేస్తోంది. జిల్లాలోని జి.సిగడాం మండలం, జగన్నాధపురం పంచాయితీ కొయ్యన్నపేటలో ఈ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. 

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా విలయం జనాల్ని పిట్టల్లా రాలిపోయేలా చేస్తోంది. జిల్లాలోని జి.సిగడాం మండలం, జగన్నాధపురం పంచాయితీ కొయ్యన్నపేటలో ఈ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. 

"

అసిరి నాయుడు అనే వ్యక్తి కుటుంబ సభ్యులు కళ్లముందే శ్వాస అందక కుప్పకూలి ఆక్సిజన్ అందక మరణించాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. జగన్నాథ వలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరినాయుడు(44) విజయవాడలో కూలి పనులు చేసేవాడు.

ఇటీవల అక్కడ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కుటుంబంతో పాటు ఆదివారం స్వగ్రామానికి వచ్చేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వారిని ఊరికి దూరంగా ఉన్న ఓ కల్లంలో ఉంచారు. 

ఇంతలో అసిరినాయుడు పరిస్థితి విషమించింది. కిందపడి కొట్టుకుంటున్నాడు. కాగా భార్య దగ్గరికి వెళ్లడానికి భయపడుతుంది.. స్తానికులు మీ అందరికీ పాజిటివే కదమ్మా వెళ్లండి అంటున్నా భయపడుతుంటే.. కూతురు మాత్రం నాన్నా.. నాన్నా.. అంటూ హృదయవిదారకంగా రోధిస్తూ తండ్రి నోట్లో నీళ్లు పోసింది. 

ఇంతలో తండ్రి ఎక్కిళ్లు తీసి.. ఆగిపోయాడు.. తల్లి కూతుర్ని దూరంగా లాగేసింది. కాగా అతనికి ఇంకాస్త ఊపిరి ఉందని గ్రామస్తులు అంటుండగా.. సొంత భర్త కళ్లముందే చనిపోతుంటే కరోనా భయం దగ్గరికి వెళ్లకుండా చేస్తున్న కాఠిన్యం అందరన్నీ కలిచి వేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు.. ఈ నాలుగు జిల్లాల్లో అల్లకల్లోలమే
Varudu Kalyani: ఆవకాయ ఫెస్టివల్ కి డబ్బులుంటాయి.. ఆడబిడ్డ నిధికి డబ్బులుండవా? | Asianet News Telugu