కరోనా విషాదం : హాస్పిటల్ లోనే భార్య చేతిలో భర్త మృతి.. ! (వీడియో)

Published : May 03, 2021, 09:22 AM IST
కరోనా విషాదం : హాస్పిటల్ లోనే భార్య చేతిలో భర్త మృతి.. ! (వీడియో)

సారాంశం

కరోనా సెకండ్ వేవ్ మనుషుల్ని వేగంగా మాయం చేస్తోంది. రోజుకు వందలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. కళ్ల ముందు కనిపించే వ్యక్తిని క్షణాల్లో ఊపిరి తీసి ఆత్మీయులకు తీరని శోకాన్ని మిగులుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ మనుషుల్ని వేగంగా మాయం చేస్తోంది. రోజుకు వందలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. కళ్ల ముందు కనిపించే వ్యక్తిని క్షణాల్లో ఊపిరి తీసి ఆత్మీయులకు తీరని శోకాన్ని మిగులుస్తోంది.

"

అలాంటి హృదయ విషాదరక ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి అమర హాస్పిటల్ వెయిటింగ్ ఏరియాలోనే భార్య చేతుల్లోనే  భర్త ఇంజినీర్ శేఖర్ ప్రాణాలు విడిచారు. 

హాస్పిటల్ కు వచ్చినప్పుటినుంచి అతడికి శ్వాస అందడం లేదని భార్య తాపత్రయపడుతున్నా.. సిబ్బంది పట్టించుకోలేదు. ప్రాణాలు పోతున్నా అతన్ని హాస్పిటల్ లోపలికి తరలించి ట్రీట్మెంట్  అందించలేదు. .ఒకపక్క ప్రాణం పోతుంటే ఒక్క డాక్టర్ కూడా చూడడానికి రాలేదు. 

ఏమండీ లేవండీ.. ఏమైందండీ.. లేవండీ అంటూ ఆ భార్య .. పడే ఆవేదన అక్కడున్న వారందరినీ కదిలించింది. హాస్పిటల్ లోనే ఇలాంటి పరిస్థితి ఎదురయితే ఎలా అనే భయాన్ని అక్కడివారిలో కలిగించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం