వైసీపీది దొంగ ఓట్ల, దొంగ నోట్ల విజయం.. అచ్చెన్నాయుడు

By AN Telugu  |  First Published May 3, 2021, 10:06 AM IST

తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీది దొంగ ఓట్ల, దొంగ నోట్ల విజయం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఇది జగన్ రెడ్డి సంక్షేమ పథకాల విజయం కాదని, ప్రైవేటు బస్సుల  విజయమని ప్రజలే అంటున్నారన్నారు. 


తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీది దొంగ ఓట్ల, దొంగ నోట్ల విజయం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఇది జగన్ రెడ్డి సంక్షేమ పథకాల విజయం కాదని, ప్రైవేటు బస్సుల  విజయమని ప్రజలే అంటున్నారన్నారు. 

దొంగ కంపెనీలు పెట్టి, వేల కోట్లు దోచినట్లు దొంగ ఓట్లు వేసి తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ఓటర్ల హక్కును కాలరాసి తెచ్చుకున్నది విజయమే కాదు అన్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచినా నైతికంగా టీడీపినే గెలిచిందని ప్రజలు అంటున్నారన్నారు.

Latest Videos

undefined

అన్యాయాన్ని తిరుపతి వీధుల్లో నడిపించిన ఘనత వైసీపీదని ధ్వజమెత్తారు.  నైతికంగా గెలిచామన్న సంతోషం వైసీపీ నేతల మొహాల్లోనే కనబడటం లేదు. వైసీపీ చేసే ప్రతి అరాచకం, దుర్మార్గాలకు బుద్ధి చెప్పడానికి ఒక రోజు రాసి పెట్టి వుంది అన్నారు. 

ఆ రోజున వైసీపీ నేతలు మొత్తం బాధపడే స్థితి వస్తుంది. వైసీపీ దురాగతాలను దగ్గరుండి చూపించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల తెగువను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అన్నారు. 

వైసీపీ నేతల మదాన్ని తిరుపతి ప్రజలు అణిచారు. దొంగ ఓట్లకు పాల్పడలేదని తిరుపతి వెంకన్న సాక్షిగా వైసీపీ నేతలు బహిరంగ ప్రమాణానికి రావాలని సవాల్ చేశారు.
దొంగ ఓట్లు వేసినట్లు స్పష్టమైన ఆధారాలు చూపించినా సీఈసీ స్పందించకపోవడం దారుణం అన్నారు. 

కాగా నిన్నటి ఫలితాల్లో తిరుపతి లోకసభ స్థానంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం సాధించారు. తిరుపతిలో చంద్రబాబు విస్తృత ప్రచారం గానీ, వ్యూహం గానీ పనిచేయలేదు. తిరుపతిలో బిజెపికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇమేజ్ పనికి రాలేదు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2 లక్ష 35 వేల 798 ఓట్ల మెజారిటీ సాధించారు.

వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2 లక్షల 31 వేలకు పైగా మెజారిటీని సాధించారు.  వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యం తిరుపతిలో 2 లక్షల 25 వేల 773కు చేరుకుంది.
 

click me!